CM Jagan: సీఎం జగన్ విద్యా శాఖపై సమీక్ష
CM Jagan: బడి పిల్లలకు అందించే ఆహారంపై ప్రత్యేక శ్రద్ధపెట్టాం
CM Jagan: బడి పిల్లలకు అందించే ఆహారంపై ప్రత్యేక శ్రద్ధపెట్టామని సీఎం జగన్ తెలిపారు. పిల్లలకు రుచికరమై, పౌష్టికాహారాన్ని అందిస్తున్నామన్నారు. రాగి జావను కూడా ప్రవేశ పెట్టామని చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో క్వాలిటీ తగ్గకూడదని.. నాణ్యతా ప్రమాణాలపై ప్రత్య్కేక దృష్టి పెట్టాలన్నారు. ప్రతి రోజు పిల్లలకు అందిస్తున్న ఆహారంపై పర్యవేక్షణ ఉండాలని సూచించారు. క్యాంపు కార్యాలయంలో విద్యా శాఖపై జగన్ సమీక్ష నిర్వహించారు. 8వ తరగతి విద్యార్థులు, టీచర్లకు ఇచ్చిన ట్యాబుల వినియోగంపై సమీక్షించారు. ఈ ఏడాది రెండో విడత ట్యాబులు ఇచ్చేందుకు సిద్ధం కావాలని జగన్ ఆదేశించారు.