CM Jagan: కల్యాణమస్తు, షాదీ తోఫా నిధులను విడుదల చేసిన సీఎం జగన్

CM Jagan: నాలుగు విడతల్లో కల్యాణమస్తు, షాదీ తోఫా నిధుల విడుదల

Update: 2023-08-09 08:23 GMT

CM Jagan: కల్యాణమస్తు, షాదీ తోఫా నిధులను విడుదల చేసిన సీఎం జగన్ 

CM Jagan: ప్రతి యేటా నాలుగు విడతల్లో కల్యాణమస్తు, షాదీ తోఫా నిధులను తల్లుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు ఏపీ సీఎం జగన్ తెలిపారు. వైఎస్సార్‌ కల్యాణమస్తు, వైఎస్సార్‌ షాదీ తోఫా నిధుల్ని తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయం నుంచి ఆయన బటన్‌ నొక్కి విడుదల చేశారు. పేద ఆడబిడ్డల పెళ్లి కోసం అందిస్తున్న ఆర్థిక సహాయాన్ని లబ్ధిదారుల ఖాతాల్లో ఆయన జమ చేశారు. ఈ పథకాల ద్వారా అర్హులైన 18 వేల 883 జంటలకు లబ్ధి చేకూరనుందని, ఇందుకోసం 141 కోట్ల 60 లక్షల రూపాయలను విడుదల చేశామన్నారాయన. 

Tags:    

Similar News