Chandrababu: అధికారులకు సీఎం చంద్రబాబు వార్నింగ్
విజయవాడ కలెక్టరేట్ వద్ద మీడియాతో సీఎం మాట్లాడారు. నగరంలో డివిజన్‌కు ఒక సీనియర్ ఐఏఎస్‌ను నియమించామని చెప్పారు. 32 మంది ఐఏఎస్ అధికారులు సహాయక చర్యల్లో ఉన్నారన్నారు.
Chandrababu: ఏపీలో ఐదేళ్లుగా అధికార వ్యవస్థలేవీ పనిచేయలేదన్నారు సీఎం చంద్రబాబు. ఎమర్జెన్సీ టైమ్‌లో అధికారులు సరిగ్గా పనిచేయకపోతే సహించేది లేదని వార్నింగ్ ఇచ్చారు. అత్యవసర పరిస్థితుల్లో సర్వశక్తులూ ఒడ్డి పనిచేయాలని ఆయన ఆదేశించారు. జక్కంపూడిలో ఓ అధికారిని సస్పెండ్ చేసినట్లు తెలిపారు. ఎవరినీ ఉపేక్షించేది లేదని అన్నారు. మంత్రులు కూడా చెప్పిన పని చేయకపోతే వాళ్లపైనా చర్యలకు వెనుకాడబోనని తేల్చిచెప్పారు.
విజయవాడ కలెక్టరేట్ వద్ద మీడియాతో సీఎం మాట్లాడారు. నగరంలో డివిజన్‌కు ఒక సీనియర్ ఐఏఎస్‌ను నియమించామని చెప్పారు. 32 మంది ఐఏఎస్ అధికారులు సహాయక చర్యల్లో ఉన్నారన్నారు. పది జిల్లాల నుంచి ఆహారం సమకూర్చామని.. బాధితులకు మూడు పూటలా అందించాలని ఆదేశించినట్లు చెప్పారు. చిట్టచివరి బాధితుడికి కూడా సాయం అందాలని స్పష్టం చేశారు.