చిత్తూరు జిల్లాలో చంద్రబాబు పర్యటన.. గోబ్యాక్ అంటూ నినాదాలు
Chandrababu: చంద్రబాబు పర్యటనతో చిత్తూరు జిల్లాలో హై టెన్షన్
Chandrababu: చిత్తూరు జిల్లాలో చంద్రబాబు పర్యటనతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సోంపల్లిలో హంద్రీనీవా ప్రాజెక్టును పరిశీలించేందుకు చంద్రబాబు బయలుదేరారు. ప్రస్తుతం ములకల చెరువు దగ్గర ఉన్న చంద్రబాబు.. కాసేపట్లో ప్రాజెక్టు పరిశీలిస్తారు. అనంతరం పుంగనూరు మీదుగా చిత్తూరు వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో పుంగనూరులో వైసీపీ శ్రేణులు నిరసనకు దిగాయి. ముడెప్ప సర్కిల్‌కు భారీగా చేరుకున్న వైసీపీ నేతలు.. చంద్రబాబును అడ్డకుంటామని చెబుతున్నారు. చంద్రబాబు గోబ్యాక్ అంటూ నినాదాలు చేస్తున్నారు. పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు.