Chandrababu: చికెన్‌ కొట్టులోనూ వైసీపీ ఎమ్మెల్యే వసూళ్లు..

Chandrababu: టీడీపీ హయాంలో రాయలసీమ ప్రాజెక్టులకు 12వేల కోట్లు ఖర్చు చేశామని ఆ పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు.

Update: 2023-08-02 11:41 GMT

Chandrababu: చికెన్‌ కొట్టులోనూ వైసీపీ ఎమ్మెల్యే వసూళ్లు..

Chandrababu: టీడీపీ హయాంలో రాయలసీమ ప్రాజెక్టులకు 12వేల కోట్లు ఖర్చు చేశామని ఆ పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. సీఎం జగన్‌ కేవలం 2వేల కోట్లే ఖర్చు చేశారని ఆరోపించారు. సాగునీటి ప్రాజెక్టుల సందర్శనలో భాగంగా వైఎస్‌ఆర్‌ జిల్లాలో పర్యటించిన చంద్రబాబు..జమ్మలమడుగు సర్కిల్‌లో నిర్వహించిన రోడ్‌షోలో మాట్లాడారు. స్థానిక వైసీపీ ఎమ్మెల్యే చికెన్‌ కొట్టులోనూ వసూళ్లకు పాల్పడుతున్నారని చంద్రబాబు ఆరోపించారు. సీఎం జగన్‌కు ప్రజలను దోచుకోవాలనే తప్ప.. మేలు చేయాలనిలేదని విమర్శించారు. జగన్‌ కొత్తగా ఒక్క ప్రాజెక్టయినా తెచ్చారా? ఒక్క ఎకరానికైనా నీళ్లిచ్చారా? అని ప్రశ్నించారు. జమ్మలమడుగు ప్రజల కోసం టీడీపీ నేత భూపేష్‌ పనిచేస్తారని చంద్రబాబు చెప్పారు.

Tags:    

Similar News