TTD: తెలంగాణ నేతలకు శుభవార్త చెప్పిన టీటీడీ..వీఐపీ బ్రేక్ దర్శనం సిఫార్సు లేఖలకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్

Update: 2024-12-31 04:23 GMT

TTD: తెలంగాణ నేతలకు శుభవార్త చెప్పిన టీటీడీ..వీఐపీ బ్రేక్ దర్శనం సిఫార్సు లేఖలకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్

TTD: తిరుమల శ్రీవారికి దర్శించుకునేందుకు తెలంగాణ నుంచి భారీ సంఖ్యలో భక్తులు తిరుమలకు వెళ్తుంటారు. ఉమ్మడి రాష్ట్రం నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లు విడిపోయిన తర్వాత స్వామివారి దర్శనం విషయంలో తమకు ప్రాధాన్యత దక్కడం లేదంటూ తెలంగాణ ప్రజాప్రతినిధులు గత కొంత కాలంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామితో వందల ఏళ్లుగా విడదీయరాని ఆధ్యాత్మిక బంధం ఉందని..తెలంగాణ నుంచి ప్రతిరోజూ వేల సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు తిరుమల వస్తున్నారని ఈ సంఖ్య ప్రతిఏటా పెరుగుతూనే ఉంది కాబట్టి ఏపీ ప్రభుత్వం ఈ విషయంలో స్పందించి తమకు ప్రాధాన్యత కల్పించాలని కోరతున్నారు. ఈ విషయం పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సానుకూలంగానే స్పందించారు.

గత కొంతకాలంగా తిరుమల కొండపై శ్రీవారి దర్శనాల్లో తమకు ప్రధాన్యం దక్కడం లేదని తెలంగాణకు చెందిన ప్రజాప్రతినిధులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల సిఫార్సు లేఖలను అనుమతించేందుకు సీఎం అంగీకరించినట్లు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. సోమవారం సీఎంతో సమావేశం అయిన బీఆర్ నాయుడు తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలపై చర్చించారు.


ఈ నేపథ్యంలో సిఫార్సు లేఖలు తీసుకునేందుకు చంద్రబాబు సానుకూలంగా స్పందించినట్లు బీఆర్ నాయుడు తెలిపారు. వారానికి నాలుగు సిఫార్సు లేఖలను అనుమతించాలని చెప్పినట్లు ఆయన వెల్లడించారు. వారానికి 2 బ్రేక్ దర్శనాలు మరో రెండు రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శనానికి సంబంధించిన లేఖలు అనుమతించేందుకు సీఎం అంగీకరించారని బీఆర్ నాయుడు తెలిపారు. ప్రతిసిఫార్సు లేఖతో ఆరుగురు భక్తుల వరకు దర్శనానికి సిఫారసు చేయవచ్చు. ఈ నిర్ణయంపై తెలంగాణ ప్రజాప్రతినిధులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు, టీటీడీ చైర్మన్ కు తెలంగాణ స్పీకర్ ప్రసాద్ ధన్యవాదాలు తెలిపారు. 

Tags:    

Similar News