Buggana: ప్రతి పక్షాలపై బుగ్గన ఆగ్రహం
Buggana: అభివృద్ధి కోసమే అప్పులు చేస్తున్నామన్న బుగ్గన
Buggana: ఏపీ లోని ప్రతిపక్ష పార్టీలపై ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి కోసం అప్పులు చేస్తుంటే ప్రతిపక్షాలు నానా రాద్ధాంతలు చేస్తున్నాయని ఆరోపించారు. విజయనగరం జిల్లాలో ఆర్థిక శాఖ భవనం ప్రారంభోత్సవానికి వచ్చిన ఆయన రాష్ట్ర ప్రభుత్వం పై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలకు స్పందించారు. రాష్ట్రంలో రోడ్ల నిర్మాణాల కోసం కేంద్రం నుంచి అత్యధిక నిధులు తెచ్చామని, కానీ ప్రతిపక్షాలు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నాయన్నారు.
జాతీయ రహదారులను కనీవినీ ఎరుగని విధంగా అభివృద్ధి చేసామని, పెట్టుబడులు, పరిశ్రమల విషయంలో కోవిడ్ ఇబ్బంది పెట్టినప్పటి అభివృద్ధి చేశామన్నారు. ఈ విషయాన్ని చట్టసభల్లో కూడా స్పష్టం చేశామన్నారు. అప్పుల విషయంలోనూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని, అయినప్పటికీ గత ప్రభుత్వాలు చేసిన అప్పులకన్నా తక్కువే అప్పు చేశామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంత అభివృద్ధి చేస్తున్నా ప్రతిపక్షాలు అసత్య ప్రచారం చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.