Bopparaju Venkateshwarlu: మూడేళ్ల కిందటి డిమాండ్లను పరిష్కరించని ఏపీ సర్కార్

Bopparaju Venkateshwarlu: మిగిలిన డిమాండ్లపై ప్రభుత్వం నిర్ణయం తీసుకునే వరకు ఉద్యమం ఆగదు

Update: 2023-05-21 08:15 GMT

Bopparaju Venkateshwarlu: మూడేళ్ల కిందటి డిమాండ్లను పరిష్కరించని ఏపీ సర్కార్ 

Bopparaju Venkateshwarlu: ఏపీలో మూడేళ్ల కింద కొన్ని డిమాండ్లపై తాము చేసుకున్న ఒప్పందంలో చేర్చిన అంశాలను ప్రభుత్వం పరిష్కరించడం లేదని ఏపీ జెఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిసారి చాయ్, బిస్కట్ సమావేశాలు మాత్రమే జరుగుతున్నాయని అన్నారు. తాము ఉద్యమ బాట పట్టిన తరువాతే కారుణ్య నియామకాలు వచ్చాయని, ఉద్యమ ఫలితంగానే పోలీసులకు 525 కోట్ల రూపాయలు సరెండర్ లీవులు ఇచ్చారన్నారు... తాము ఒప్పందం చేసుకున్న మిగిలిన అంశాలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకునే వరకూ ఉద్యమం ఆగదని అన్నారు. మిగిలిన డిమాండ్లపై తాము ఏపీ చీఫ్ సెక్రటరీని కలిశామని, ప్రధాన ఆర్థిక డిమాండ్లపై చర్చించాలని కోరామని చెప్పారు. నాలుగు డీఏలు ఇవ్వాలని, ఎప్పుడు ఇస్తారో చెప్పాలని సీఎస్‌ను కోరామన్నారు. కొత్త పీఆర్సీ రికమండెడ్ పే స్కేళ్లు బయటపెట్టి.. 12వ పీఆర్సీని ఏర్పాటు చేయాలని కూడా డిమాండ్ చేశామన్నారు.

ఏపీ పీటీడీ ఎంప్లాయాస్ యూనియన్ 27వ మహాసభలు ఈనెల 24న విజయవాడలో నిర్వహించనున్నట్లు ఏపీ జెఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఏపీ పీటీడీ ఎంప్లాయిస్ యూనియన్ ప్రతినిధి వలిశెట్టి దామోదర్ వెల్లడించారు. ఈ సందర్భంగా మహాసభకు సంబంధించిన పోస్టర్లను వారు విడుదల చేశారు. రాష్ట్ర స్థాయిలో 9 వేల మంది మహాసభకు హాజరవుతారని అంచనా వేస్తున్నామని చెప్పారు. ఈ మహాసభలకు రవాణా శాఖామంత్రి, ఏపీఎస్ ఆర్టీసీ చైర్మన్, ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ హాజరవుతారని, ఏపీ పీటీడీ ఎంప్లాయీస్ యూనియన్ నూతన కమిటీ ఎన్నికలు కూడా ఈ మహాసభలో జరుగుతాయన్నారు. మూడో ప్రాంతీయ సదస్సు ఏలూరులో ఈనెల 27న జరుగుతుందని చెప్పారు.

Tags:    

Similar News