ఈదురు గాలులకు ధ్వంసమైన అరటి తోటలు.. తీవ్రంగా నష్టపోయిన అరటి రైతులు

2000 ఎకరాల్లో పంట నష్టం.. తమను ఆదుకోవాలని కోరుతున్న రైతులు

Update: 2024-05-17 10:17 GMT

ఈదురు గాలులకు ధ్వంసమైన అరటి తోటలు.. తీవ్రంగా నష్టపోయిన అరటి రైతులు

ఈదురు గాలులతో కూడిన వర్షం నంద్యాల జిల్లాలో అన్నదాతను నట్టేట ముంచింది. ఊహించని రీతిలో గాలివాన విరుచుకుపడడంతో 2 వేల ఎకరాల్లో అరటి తోట దెబ్బతింది.

కళ్ల ముందే ఏపుగా పెరిగిన పంట దెబ్బతినడంతో అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. జిల్లాలోని మహానంది, ఆత్మకూరు, వెలుగోడు మండలాల్లో అరటి సాగు చేశారు. ఈ మండలాలతో పాటు తిమ్మాపురం, బుక్కాపురం, శ్రీనగరం, గాజుపల్లి, అబ్బిపురం సుమారు ఐదు వేల ఎకరాల్లో రైతులు అరటిని సాగు చేశారు.

వర్షం కారణంగా అరటి పంట పూర్తిగా పాడైందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎకరం అరటి పంటకు రూ. 70 వేల నుండి లక్ష రూపాయాల వరకు పెట్టుబడి పెట్టాల్సి వచ్చిందని రైతులు చెబుతున్నారు.

అత్యధిక దిగుబడి వచ్చే అమృతాలు ,సుగంధాలు లాంటి వెరైటీ ల ను ఎక్కువగా పండిస్తారు ఈ ప్రాంత వాసులు. వీటికి దేశవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంది. తెలుగు రాష్ట్రాలకే కాకుండా ఒడిస్సా, కలకత్తా, బాంబే, మేఘాలయ లాంటి దూర రాష్ట్రాలకు సైతం వీటిని ఎగుమతి చేస్తారు... అత్యంత మధురంగా ఉండే ఇక్కడి అరటి పండుని ఇష్టపడని వారు ఉండరు.

అయితే ప్రతి యేడాది కూడా అకాలవర్షాలు, తుఫాన్ లు ,ఈదురు గాలుల తో , అరటి రైతులు కుదేలవుతున్నారు. పంట కోత దశలో రాలిపోవడంతో తీరని నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. ఈదురుగాలుల బీభత్సానికి మహానంది మండలం లో సుమారు 900 ఎకరాల్లో పంట నష్టం జరిగిందని అధికారులు తెలిపారు, రైతన్నలు మాత్రం సుమారు 2 వేల ఎకరాల ల్లో పంట నష్టం జరిగిందని చెబుతున్నారు.

రైతుల పడుతున్న ఇబ్బందులను గమనించిన రాజకీయ పార్టీ నేతలు... అన్నదాతలను పరామర్శించి,నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులకు విజ్ఞప్తులు చేస్తామన్నారు. ఐతే ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యం లో ఇంత కన్నా ఎక్కువగా ఏమి చేయలేమని అన్నారు. అయితే రైతులను అన్ని విధాలా ఆదుకుంటామని అధికారులు చెబుతున్నారు.


Tags:    

Similar News