పవన్ దిష్టిబొమ్మ దహనం చేసిన వాలంటీర్లు.. పవన్ ఫొటోలకు చెప్పు దెబ్బలు కొడుతూ నిరసనలు

AP Volunteers: పవన్ వెంటనే క్షమాపణ చెప్పాలని వాలంటీర్ల డిమాండ్

Update: 2023-07-10 12:31 GMT

పవన్ దిష్టిబొమ్మ దహనం చేసిన వాలంటీర్లు.. పవన్ ఫొటోలకు చెప్పు దెబ్బలు కొడుతూ నిరసనలు

AP Volunteers: మహిళల మిస్సింగ్ ఇష్యూలో.. వాలంటీర్‌ వ్యవస్థపై జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ చేసిన కామెంట్స్‌ దుమారం రేపాయి. పవన్‌ వ్యాఖ్యలకు నిరసనగా.. పలుచోట్ల వాలంటీర్లు ఆందోళనకు దిగారు. విజయవాడలో పవన్ ఫొటోలకు చెప్పు దెబ్బలు కొడుతూ వాలంటీర్లు నిరసన వ్యక్తం చేశారు. తమను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన పవన్ వెంటనే క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు.

అటు కర్నూల్‌లోనూ వాలంటీర్లు రోడ్డెక్కారు. పవన్ కామెంట్స్.. యువత ఉద్యోగ,‌ ఉపాధి అవకాశాలు కోల్పోయే విధంగా ఉన్నాయని మండిపడ్డారు. వాలంటీర్ల వ్యవస్థ ఏంటో తెలుసుకొని మాట్లాడాలని లేదంటే భవిష్యత్తులో వాలంటీర్ల ఆగ్రహానికి గురికాక తప్పదని వారు హెచ్చరించారు.

నిస్వార్థంగా సేవ చేస్తున్న తమపై పవన్ నిరాధార ఆరోపణలు చేస్తున్నారని అనంతపురం జిల్లా ఉరవకొండ వాలంటీర్లు మండిపడ్డారు. పవన్ వ్యాఖ్యలను ఖండిస్తూ.. స్థానిక క్లాక్ టవర్ వద్ద ప్లకార్డులు పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. తమకు వెంటనే క్షమాపణ చెప్పాలని లేకపోతే ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని వాలంటీర్లు హెచ్చరించారు.

Tags:    

Similar News