పవన్ కల్యాణ్ కు సవాల్ విసిరిన ఏపీ మంత్రి ధర్మాన

Minister Dharmana Prasada Rao: ఏపీ మంత్రి ధర్మాన ప్రసాదరావు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కు సవాల్ విసిరారు.

Update: 2022-08-08 11:50 GMT
Ap Minister Dharmana Prasada Rao Satires On Pawan Kalyan

పవన్ కల్యాణ్ కు సవాల్ విసిరిన ఏపీ మంత్రి ధర్మాన

  • whatsapp icon

Minister Dharmana Prasada Rao: ఏపీ మంత్రి ధర్మాన ప్రసాదరావు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కు సవాల్ విసిరారు. తనకు ఇప్పుడు 64 ఏళ్లని, పవన్ తనతో పాటు నడవగలరా ? అని ప్రశ్నించారు. సినిమాలు వేరు, రాజకీయాలు వేరన్న విషయం పవన్ గ్రహించాలని ధర్మాన సూచించారు. మాటలు చెప్పినంత సులభంగా ఏమీ ప్రజాజీవితం ఉండదని ధర్మాన వ్యాఖ్యానించారు. అధికారం, పదవులు పట్టించుకోకుండా నాలుగున్నర దశాబ్దాలుగా ప్రజాజీవితంలో ఉన్నానని వెల్లడించారు. శ్రీకాకుళం జిల్లా లింగాలవలస గ్రామంలో మంత్రి ధర్మాన గడపగడపకు కార్యక్రమంలో పాల్గొన్నారు. కాగా, గ్రామంలో కనిపించిన పవన్ కల్యాణ్ పోస్టర్ లో స్థానిక యువకుల ఫొటోలు కూడా ఉండడం పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.

Tags:    

Similar News