వాలంటీర్ల పట్ల పవన్ వ్యాఖ్యలపై హైకోర్టుకు ఏపీ ప్రభుత్వం..
AP Government: గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థకు నష్టం కలిగేలా..
AP Government: వాలంటీర్లపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల దుమారం కొనసాగుతూనే ఉంది. ఈ విషయంపై ఏపీ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. దురుద్దేశపూర్వకంగానే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేశారని కోర్టు దృష్టికి తీసుకెళ్లింది ప్రభుత్వం. వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఏపీలో ప్రజల డేటా చోరీకి గురయ్యే ప్రమాదం ఉందని... వాలంటీర్ వ్యవస్థ ప్రమాదకరమని పవన్ తన వారాహి యాత్రలో కామెంట్ చేశారు. అయితే పవన్ వ్యాఖ్యలు గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థకు నష్టం కలిగించేలా ఉన్నాయంది ఏపీ ప్రభుత్వం..