Home Isolation Guidelines in AP: ఏపీలో హోమ్ ఐసోలేషన్ మార్గదర్శకాల విడుదల
Home Isolation Guidelines in AP: తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ముఖ్యంగా తెలంగాణతో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్ లో కరోనా ఉధృతి తీవ్రంగా ఉంది.
Home Isolation Guidelines in AP: తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ముఖ్యంగా తెలంగాణతో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్ లో కరోనా ఉధృతి తీవ్రంగా ఉంది. రోజురోజుకూ పాజిటివ్ కేసులు సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇప్పటికే ఏపీలో కరోనా కేసుల సంఖ్య లక్షకి చేరువైంది. కరోనా కట్టడికి జగన్ సర్కార్ ప్రయత్నిస్తున్నా కేసులు ఏ మాత్రం తగ్గడంలేదు. గత వారం రోజులుగా ఏపీలో కరోనా కేసులు 7 నుండి 8 వేల వరకు నమోదు అవుతున్నాయి. దీంతో దేశంలో అత్యధిక కరోనా కేసులున్న రాష్ట్రాల జాబితాలో ఏపీ నాలుగో స్థానంలోకి వెళ్లింది. ఈ నేపథ్యంలో కరోనా సోకినట్టు నిర్దారణ అయిన వ్యక్తులను వ్యాధి తీవ్రతను బట్టి ఇంటి వద్దే ఐసోలేషన్ లో ఉంచుతున్నారు. ఈ సమయంలో కరోనా సోకి హోం ఐసోలేషన్ లో ఉండే వారికి ఇప్పటికే ఫ్రీ కిట్ ను అందిస్తోన్న ఏపీ ప్రభుత్వం భాదితులు ఎలాంటి జాగ్రతలు పాటించాలో చెబుతూ మార్గదర్శకాలు విడుదల చేసింది.
హోమ్ ఐసోలేషన్ లో చేయాల్సినవి :
- ఎల్లప్పుడూ మాస్క్ ధరించాలి (నిద్ర, ఎక్సర్‌సైజ్, స్నానం, భోజనం తప్ప)
- ఉదయం లేవగానే కరోనా సోకిన వ్యక్తి తన రూమ్‌ని తనే క్లీన్ చేసుకోవాలి.
- ఇతరులకి వీలైనంత ఎక్కువగా దూరంగా ఉండాలి
- రోగి ధరించిన బట్టలను వేడి నీటిలో తానే ఉతికి ఆరేసుకోవాలి.
- తన వస్తువులు, పాత్రల్ని తానే కడుక్కోవాలి.
- రోజూ యోగా, ఎక్సర్‌సైజ్, ధ్యానం చేయాలి.
- డాక్టర్ సలహా ప్రకారం మందులు వాడాలి.
- తన ఆరోగ్యంపై రోగి దగ్గర్లో ఉన్న ఆరోగ్య కార్యకర్త లేదా ఆరోగ్య కేంద్రం డాక్టర్‌కి తెలియజేయాలి.
- ఉన్న ఆహారాన్ని రోగులు తీసుకోవాలి.
- కుటుంబ సభ్యులతో రోగి భౌతిక దూరం పాటించాలి.
- కరోనా లక్షణాలు పెరుగుతున్నా, బయటపడినా, ఆరోగ్య కార్యకర్తకు చెప్పాలి.
చేయకూడనివి :
- ఇతరులను ఇంట్లోకి రానివ్వకూడదు.
- మీ వస్తువులను ఎవరూ ముట్టుకోకుండా చూసుకోవాలి.
- బయటకు వెళ్లకూడదు, ఇతరులను కలవకూడదు.
తీసుకోవాల్సిన ట్యాబ్లెట్ల వివరాలు :
- విటమిన్ సి (రోజుకు రెండు సార్లు)
- మల్టీమిటమిన్ (రోజుకు రెండు సార్లు)
- జింక్ మాత్ర (రోజుకు ఒకసారి)
- సెట్రిజిన్ 10మి.గ్రా. జలుబు లేదా దగ్గుఉంటే.. (రోజుకు ఒకసారి).
- పారాసిటమోల్ 500 మి.గ్రా. ట్యాబ్లెట్ (జ్వరం ఉంటే రోజుకు రెండు సార్లు).
- రానీటిడిన్ 150మి.గ్రా (కడుపులో మంట ఉంటే రోజుకు రెండు సార్లు)