Andhra Pradesh: క్లీన్ ఎనర్జీలో తొలిర్యాంకు సాధించిన ఏపీ

Andhra Pradesh: నీతి ఆయోగ్ ఇచ్చిన ర్యాంకింగ్స్‌లో క్లీన్ ఎనర్జీ విభాగంలో తొలిర్యాంకును ఏపీ కైవసం చేసుకుంది.

Update: 2021-06-04 00:42 GMT

Niti Aayog Ranking:(File Image)

Andhra Pradesh: నీతి ఆయోగ్ విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో ఏపీ మరోమారు అదరగొట్టింది. 2020 - 2021 సంవత్సరంలో పలు విభాగాల్లో ప్రగతికి సంబంధించి నీతి ఆయోగ్ జాతీయ ర్యాంకులు ప్రకటించింది. గతేడాదితో పోలిస్తే రాష్ట్రం 5పాయింట్లు అధికంగా సాధించింది. అందులో ఏపీకి విశిష్ట గుర్తింపు లభించింది. క్లీన్ ఎనర్జీ విభాగంలో ఏపీ మిగిలిన రాష్ట్రాలను వెనక్కి నెట్టి మొదటి స్థానంలో నిలిచింది. జాతీయ ర్యాంకింగ్స్‌లో ఫస్ట్ ప్లేస్ సాధించింది. మరో కీలక విభాగంలోనూ ఏపీ ఆశాజనకమైన స్థానంలో నిలిచింది.

రాష్ట్రాల స్థిర ఆర్థికాభివృద్ధిలోనూ ఏపీ మెరుగైన స్థానాన్ని సొంతం చేసుకుంది. ఆర్థికంగా స్థిరమైన అభివృద్ధి చాటిన టాప్ 5 రాష్ట్రాల్లో ఒకటిగా నిలిచింది. ఈ విభాగంలో ఏపీ జాతీయస్థాయిలో మూడో స్థానం సాధించింది. ఈ జాబితాలో కేరళ తొలిస్థానంలో నిలవగా.. రెండో స్థానంలో హిమాచల్ ప్రదేశ్ నిలిచింది. సిక్కిం, మహారాష్ట్ర ఏపీ తరువాత 4,5 స్థానాల్లో ఉన్నాయి. అయితే ఈ జాబితాలో బిహార్, అస్సాం, ఝార్ఖండ్ రాష్ట్రాలు చివరి స్థానంలో నిలిచాయి.

Tags:    

Similar News