Free Gas Cylinder: ఉచిత గ్యాస్ సిలిండర్ కీలక అప్ డేట్..ఆధార్, రేషన్ కార్డు ఉంటేనే అర్హులు

Free Gas Cylinder: ఫ్రీ గ్యాస్ సిలిండర్ స్కీంకు బుకింగ్స్ మొదలయ్యాయి. 31వ తేదీ నుంచి సిలిండర్లను అందిస్తున్నారు. ఈ స్కీముకు తాము అర్హులమా కాదా అనే అనుమానాలు లబ్దిదారుల్లో నెలకున్నాయి.

Update: 2024-11-03 04:13 GMT

Free Gas Cylinder: ఫ్రీ గ్యాస్ సిలిండర్ స్కీముకు బుకింగ్స్ షురూ అయ్యాయి. 31వ తేదీ నుంచి సిలిండర్లను అందిస్తున్నారు. ఈ స్కీముకు తాము అర్హులమా కాదా అనే అనుమానాలు లబ్దిదారుల్లో వ్యక్తం అవుతున్నాయి. రాష్ట్రంలోని మొత్తం రేషన్ కార్డులతో పోల్చితే అర్హుల సంఖ్య తక్కువగానే ఉంది. ఆధార్ కార్డు, రేషన్ కార్డు, గ్యాస్ కనెక్షన్ ఆధారంగా రాయితీ ఇస్తున్నారు. అయితే వాటి వివరాలు సరిగ్గా లేకపోవడంతోనే అర్హుల సంఖ్య తగ్గిందని అధికారులు చెబుతున్నారు.

రాష్ట్రంలో 1.54కోట్ల వంటగ్యాస్ కనెక్షన్లు ఉంటే..తాత్కాలిక అంచనా ప్రకారం ఫ్రీ సిలిండర్ కు 1.08 కోట్ల కనెక్షన్లు అర్హత పొందాయి. కానీ రేసన్ కార్డులు 1.48కోట్లు ఉన్నాయి. అయితే కొంతమందికి గ్యాస్ కనెక్షన్, రేషన్ కార్డులున్నా..ఆధార్ ఇవ్వకపోవడంతో అర్హత పొందలేరు. వీరంతా ఆధార్ అనుసంధానించుకుంటే దీపం 2.0 స్కీం అర్హుల సంఖ్య పెరుగుతుంది.

వంటగ్యాస్ రాయితీ పొందాలంటే రేషన్ కార్డు, ఆధార్, గ్యాస్ కనెక్షన్ తప్పనిసరిగా ఉండాలి. కుటుంబ సభ్యుల్లో ఎవరి పేరు మీద కనెక్షన్ ఉందో..ఆ వ్యక్తి పేరు రేషన్ కార్డులో ఉంటే రాయితీ ఉంటుంది. గ్యాస్ రాయితీ జమ అవ్వాలంటే ఈ కేవైసీ పూర్తి చేసి ఉండాలి. ఆన్ లైన్ లో లేదా డీలర్ వద్దకు వెళ్లి బుక్ చేసుకోవచ్చు. సిలిండర్ అందిన 48గంటల్లో ఇంధన సంస్థలే రాయితీ సొమ్మును లబ్దిదారుల అకౌంట్లో జమ చేస్తుంటాయి. ఇతర సమస్యలు ఏవైనా ఉన్నట్లయితే 1967 టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేయాలి. గ్రామ, వార్డు సచివాలయాల్లో తహసీల్దారు కార్యాలయాల్లో పౌర సరఫరాల అధకారులను సంప్రదించవచ్చు.

వంటగ్యాస్ సిబ్సిడీ పొందేందుకు ఈ కేవైసీ తప్పనిసరని ఇంధన సంస్థల డీలర్లు స్పష్టం చేస్తున్నారు. దీంతో లబ్దిదారులు పెద్దెత్తున గ్యాస్ డీలర్ల వద్దకు వెళ్తుండటంతో రద్దీ తలెత్తుతోంది. ప్రభుత్వం దీనిపై మరింత దృష్టి సారించాలి. గతంలో గ్యాస్ సిలిండర్ డెలివరీ సమయంలో ఈ కేవైసీ తీసుకోవాలనే ప్రతిపాదన వచ్చినా దాన్ని అమలు చేయలేదు. ఇప్పటికైనా ఆ విధానం అమలయ్యేలా చూడాలి. గ్రామ వార్డు సచివాలయ సిబ్బందితో అయినా ఈ కేవైసీ తీసుకోవాలి ఉంటుంది. 

Tags:    

Similar News