CPI Narayana: ఏపీలో ప్రభుత్వ వ్యతిరేక పెరిగింది

CPI Narayana: కోనసీమ ఉద్యమమే ఇందుకు నిదర్శనం

Update: 2022-06-06 02:59 GMT

CPI Narayana: ఏపీలో ప్రభుత్వ వ్యతిరేక పెరిగింది

CPI Narayana: ఏపీలో ప్రభుత్వ వ్యతిరేకత బడబాగ్నిలా పెరిగిపోతోందని.. పేలిపోయే విధంగా వ్యతిరేకత వస్తోందని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ తెలిపారు... కోనసీమ ఉద్యమమే అందుకు నిదర్శనమన్నారు... మహానాడులో తమకు ఏకపక్షంగా ప్రజల మద్దతు ఉందని టిడిపి ప్రకటించిందన్నారు... వైసిపి ఆత్మరక్షణలో పడిపోయి బస్సుయాత్ర చేపడితే అది కాస్తా ఫెయిల్‌ అయిందన్నారు... వైసిపి ప్రజా వ్యతిరేకతను ఎవరు క్యాష్‌ చేసుకోవాలన్న దానిపై ఇంకా క్లారిటీ రాలేదన్నారు... చంద్రబాబు అందరం కలిసి పోటీ చేయాలని సూచిస్తుంటే, వైసిపి ఓట్లు చీలకుండా చూడాలని పవన్‌ చెబుతున్నారన్నారు... బిజెపి పార్టీ ఎట్టిపరిస్థితుల్లోనూ వైసిపిని ఓడించే పని చేయదని కుండ బద్దలు కొట్టారు.

వైసిపిని దెబ్బ తీసేందుకు ఎవరు, ఎలా పనిచేయాలి, ఎలా కలిసి పోటీ చేయాలనే అంశం ఎన్నికలు సమీపించే సమయంలో నిర్ణయం తీసుకుంటామన్నారు... పవన్‌ కళ్యాణ్‌ పోత్తులపై చేసిన వ్యాఖ్యలపై కేవలం ఊహాగానాలతో ముందుకు వెళ్ళలేమని, ఓ విధానపరమైన నిర్ణయం తీసుకునేందుకు ఇంకా సమయం ఉందన్నారు... వైసిపికి వ్యతిరేకంగా తమ నిబద్దతలకు అనుగుణంగా ఎవరు పోరాటం చేసినా వారికి తాము మద్దతిస్తామని నారాయణ చెబుతున్నారు.

దావోస్‌లో ఇండియా కార్పోరేట్లను తీసుకెళ్ళి పెట్టుబడులు వచ్చాయని అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు... ఈ విధానాలు ప్రజలకు ఏమాత్రం ఉపయోగపడవన్నారు.. రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్‌ అయిపోయిందన్నారు.... కోనసీమ ఉద్యమం, బస్సుయాత్ర విఫలం అందులో భాగమే అన్నారు...

Tags:    

Similar News