పాజిటివ్ వేవ్ వైపు మళ్లుతున్న పాలన..మొదట్లో కాస్త తడబడినా..

Update: 2019-09-26 11:24 GMT

మొదట్లో కాస్త తడబడినా ఈ మధ్య కాలంలో జగన్‌ సర్కార్‌ దూకుడు పెంచింది. పాజిటివ్ వేవ్ సంపాదించే దిశగా అడుగులు వేస్తోంది. విమర్శలు ఎదురుదెబ్బల నుంచి అభినందనలు వైపు వెళ్తుంది. ఇటీవల చోటుచేసుకున్న ఘటనలు ప్రభుత్వానికి మంచి జోష్‌ని తీసుకు వస్తున్నాయి. ఇంతకీ అవేంటి?

ప్రభుత్వం ఏర్పడిన కొత్తల్లో విమర్శలు ఎదుర్కున్న అంశాల్లోనే విజయం సాధించే దిశగా అడుగులు వేస్తుంది జగన్‌ సర్కార్‌. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల విషయంలో అటు ప్రతిపక్షాల నుంచి ఇటు న్యాయ స్థానాల నుంచి విమర్శులు ఎదుర్కుని అవే అంశాలపై పాజిటివ్ వేవ్ సంపాదించింది. తీసుకున్న నిర్ణయాల అమలులో కాస్త అడ్డంకులు వచ్చినా వాటంతట అవే తొలగిపోయి విజయం దిశగా ముందుకు సాగుతోంది.

సీఎం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రివర్స్ టెండరింగ్ విధానం సూపర్ సక్సస్ అయ్యింది. పోలవరం ప్రాజెక్టుతో ప్రారంభమైన ఈ విధానం అనుకున్న దానికంటే ఎక్కువ ఫలితాలను ఇచ్చింది. పోలవరం ప్రాజెక్టు రీ టెండర్ల పక్రియలో దాదాపు 838 కోట్ల రూపాయల ఆదా జరిగింది. దీంతో రివర్స్ టెండరింగ్ విషయంలో ప్రభుత్వం పూర్తి స్థాయి సంతృప్తికరంగా ఉంది. రివర్స్ టెండరింగ్ విధానంపై అనేక విమర్శులు వచ్చినా సీఎం జగన్ వెనకడుగు వేయలేదు. చివరకు ప్రభుత్వ అదాయం అదాచేసి వచ్చే నవంబర్ నుంచి పనులు ప్రారంభించేందుకు సిద్దమవుతున్నారు.

ఇక రెండవ అంశంగా పీపీఏల పున సమీక్షను సీఎం ఛాలెంజింగ్‌గా తీసుకున్నారు. గత ప్రభుత్వం పీపీఏల విషయంలో భారీ అవినీతికి పాల్పడిందని వాటిని పునసమీక్షించి అదాయం అదా చేయాలన్నది జగన్ అలోచన. అయితే ఈ విషయంలో విద్యుత్ సంస్థలు న్యాయ స్థానాలను అశ్రయించాయి. ఈ నిర్ణయంపై ఇక్కడి ప్రతిపక్షంతో పాటు, కేంద్రలోని బీజేపీ సైతం విమర్శులు చేశాయి. ఈ విషయంలో కీలకంగా మారిన హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి అనుకూలంగా వచ్చింది. విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాలను పునఃసమీక్షకు అవకాశమే లేదన్న విద్యుత్‌కంపెనీల వాదనను హైకోర్టు తోసిపుచ్చింది. పున సమీక్ష చేస్తామనే ప్రభుత్వ వాదనను హైకోర్టు సమర్థించింది. దీంతో రెండు కీలక అంశాల ప్రభుత్వానికి అనుకూలంగా మారాయి.

ఇక గ్రామ సచివాలయం పరీక్ష విషయంలోనూ పేపర్ లీకేజీ అంటూ విమర్శులు వస్తున్నా అభ్యర్ధులు వాటని పెద్దగా పట్టించుకోవడంలేదు. ఒకేసారి లక్షా 30 వేల పోస్టుల భర్తీ చేస్తుండడంతో చాలా మందికి ఉద్యోగాలు వచ్చాయి. ఈ అంశం ప్రభుత్వానికి పాజిటీవ్ వేవ్ తెచ్చింది ఇలా ఇటీవల పలు అంశాలు పాజిటివ్‌గా రావడంతో ప్రభుత్వంలో మంచి జోష్‌ కనిపిస్తుంది.

Full View

Tags:    

Similar News