CM Chandrababu: వర్షం ఎఫెక్ట్‌.. కర్నూలులో సీఎం చంద్రబాబు పర్యటన రద్దు

ఏపీలో భారీ వర్షాలున్న ప్రాంతాల్లో పింఛన్ల పంపిణీలో సచివాలయ ఉద్యోగులకు సీఎం చంద్రబాబు వెసులుబాటు కల్పించారు. ఆయా ప్రాంతాల్లో ఇబ్బందులుంటే వచ్చే ఒకటి, రెండు రోజుల్లో పంపిణీ పూర్తి చేయవచ్చని చెప్పారు.

Update: 2024-08-31 05:47 GMT

CM Chandrababu: వర్షం ఎఫెక్ట్‌.. కర్నూలులో సీఎం చంద్రబాబు పర్యటన రద్దు

CM Chandrababu: కర్నూలులో సీఎం చంద్రబాబు పర్యటన రద్దు అయింది. వర్షాల కారణంగా సీఎం చంద్రబాబు తన పర్యటనను రద్దు చేసుకున్నారు. పింఛన్ పంపిణీ కోసం కర్నూలు జిల్లాలో పర్యటనకు ఏర్పాట్లు చేశారు. ఓర్వకల్లు గ్రామంలో ఇంటింటికి వెళ్లి పింఛన్ పంపిణీ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేయగా... భారీ వర్షాల కారణంగా అమరావతికే చంద్రబాబు పరిమితం అయ్యారు. మధ్యాహ్నం 4గంటలకు కర్నూలు ఎయిర్ పోర్ట్ నుంచి హైదరాబాద్‌కు బయలుదేరి వెళ్లనున్నారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.

కాగా ఏపీలో భారీ వర్షాలున్న ప్రాంతాల్లో పింఛన్ల పంపిణీలో సచివాలయ ఉద్యోగులకు సీఎం చంద్రబాబు వెసులుబాటు కల్పించారు. ఆయా ప్రాంతాల్లో ఇబ్బందులుంటే వచ్చే ఒకటి, రెండు రోజుల్లో పంపిణీ పూర్తి చేయవచ్చని చెప్పారు. ఈ విషయంలో సచివాలయ ఉద్యోగులపై ఒత్తిడి తీసుకురావద్దని, టార్గెట్ పెట్టవద్దని కలెక్టర్లను ఆదేశించారు. వర్షాలు లేని ప్రాంతాల్లో యథావిధిగా పింఛన్ల పంపిణీ పూర్తి చేయాలన్నారు.

Tags:    

Similar News