AP Cabinet Meeting: ఇవాళ ఏపీ కేబినెట్ సమావేశం
AP Cabinet Meeting: మంత్రులకు దిశానిర్దేశం చేయనున్న సీఎం జగన్
AP Cabinet Meeting: ఇవాళ ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. సీఎం జగన్ అధ్యక్షతన మంత్రివర్గం భేటీ కానుంది. వెలగపూడి సచివాలయంలోని ఫస్ట్ ఫ్లోర్ కేబినెట్ హాల్‌లో ఈ సమావేశం జరుగనుంది. ఉదయం 11 గంటలకు సీఎం జగన్ అధ్యక్షతన కేబినెట్ భేటీ ప్రారంభం కానుంది. ఈ సమావేశంలో కీలక అంశాలపై మంత్రివర్గం నిర్ణయం తీసుకోనుంది.
వర్షాకాల అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై కేబినెట్ చర్చించనుంది. రేపటి నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల పని దినాలపై కేబినెట్‌లో చర్చించనున్నారు. మరో వైపు చంద్రబాబు అరెస్ట్ తర్వాత జరుగుతున్న సమావేశాలు కావడంతో ప్రాధాన్యత సంతరించుకున్నాయి. టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలపై రోజుకో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు సీఎం జగన్.
మరో వైపు అన్ని ఆర్డినెన్స్‌లకు సంబంధించిన బిల్లులు, మరికొన్ని కొత్త బిల్లులను ఏపీ ప్రభుత్వం సమావేశాల్లో ప్రవేశపెట్టనుంది. బిల్లులతోపాటు కీలక అంశాలపై సభలో ప్రస్తావనకు వచ్చే ఛాన్స్ ఉంది. అసెంబ్లీ సమావేశాల వేదికగా చంద్రబాబుపై కేసులను ప్రస్తావించడానికి వైసీపీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ నేపథ్యంలో మంత్రులకు ఏపీ సీఎం జగన్ ఎలాంటి దిశా నిర్దేశం చేయనున్నారు. తాజా పరిణామాల దృష్ట్యా ఎలాంటి బాధ్యతలను మంత్రులను అప్పగిస్తారనే దానిపై ఆసక్తి నెలకొంది.