CM Jagan: అన్ని కార్యక్రమాలు చేస్తూ ఎన్నికలకు సిద్ధం కావాలి
CM Jagan: గడపగడపకు మన ప్రభుత్వ కార్యక్రమం మెరుగ్గా సాగాలి
CM Jagan: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. ఏపీలో అధికార పార్టీ వైసీపీ సన్నద్ధమవుతోంది. టార్గెట్ 175 దిశగా అడుగులు వేసేలా అధినేత జగన్ అడుగులు వేస్తున్నారు. పార్టీ నేతలకు ఎన్నికల సన్నద్ధతపై దిశానిర్దేశం చేస్తున్నారు. అందులో భాగంగానే ఇవాళ కేబినెట్ భేటీ అనంతరం మంత్రులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు జగన్. ఎన్నికలకు అందరూ సన్నద్ధం కావాలని సూచించారు. నిత్యం ప్రజల్లోనే ఉండాలంటూ దిశానిర్దేశం చేశారు.
కేబినెట్ భేటీ అనంతరం మంత్రులతో ప్రత్యేక భేటీ అయిన సీఎం జగన్.. ప్రభుత్వ కార్యక్రమాలపై ఆరా తీశారు. జగనన్న సురక్ష కార్యక్రమం బాగా జరుగుతోందన్న సీఎం.. మరింత బాగా కొనసాగించాలన్నారు. గడపగడపకు మన ప్రభుత్వ కార్యక్రమం మెరుగ్గా సాగేలా చూడాలని సూచించారు. అన్ని కార్యక్రమాలు చేస్తూ ఎన్నికలకు సిద్ధం కావాలని తెలిపారు.