Rain Alert: ఏపీకి పొంచిఉన్న మరో ముప్పు.. వాతవరణ శాఖ భారీ హెచ్చరిక
Rain Alert: 21 రైళ్లు రద్దు, 17 రైళ్లను దారి మళ్లింపు
Rain Alert: భారీ వర్షాలతో ఇప్పటికే అతలాకుతలం అవుతున్న ఏపీకి.. మరోసారి వాతావరణ కేంద్రం షాకింగ్ న్యూస్ చెప్పింది. రాగల 24 గంటల్లో దక్షిణ కోస్తాలోని పలు ప్రాంతాల్లో, ఉత్తర కోస్తాలో కొన్ని ప్రాంతాలలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం అవకాశం ఉందని అప్రమత్తం చేసింది. విదర్భ, తెలంగాణ ప్రాంతాలలో వాయుగుండం కొనసాగుతోందని తెలిపింది. రామగుండం పట్టణానికి ఉత్తర ఈశాన్య దిశగా 135 కిలోమీటర్లు, వాగ్ధాకు అగ్నేయంగా 170 కిలోమీటర్లు దూరంలో ఈ వాయు గుండం కేంద్రీకృతమై ఉందని వెల్లడించింది. వాయువ్య దిశగా కదులుతూ రాగల 12 గంటలలో బలహీన పడి తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. భారీ వర్షాల నేపథ్యంలో పలు చోట్ల రైలు పట్టాలపై నీళ్లు నిలిచాయి. దీంతో ఈ రోజు, రేపు విశాఖపట్నం మీదగా నడిచే పలు రైళ్ల రాకపోకలు రద్దయ్యాయి. 21 రైళ్లు రద్దు కాగా.. 17 రైళ్లను దారి మళ్లించారు.