Tirumala: తిరుమలలో ఎట్టకేలకు చిక్కిన మరో చిరుత
Tirumala: ఆపరేషన్ చిరుత ముగిసినట్లు వెల్లడించిన అధికారులు
Tirumala: తిరుమల అలిపిరి నడక మార్గంలో మరో చిరుత చిక్కింది. దీంతో ఆపరేషన్ చిరుత ముగిసినట్లు అధికారులు వెల్లడించారు. నడక మార్గంలోని 7వ మైలు వద్ద ఏర్పాటు చేసిన బోనులో వేకువజామును చిరుత చిక్కిందని సీసీఎఫ్ అధికారి నాగేశ్వరరావు తెలిపారు. ఇప్పటి వరకు నాలుగు చిరుతలను బంధించామన్నారు. నడక మార్గంలో ట్రాప్ కెమెరాలతో వన్య ప్రాణుల సంచారాన్ని నిరంతరం మానిటరింగ్ చేస్తామని నాగేశ్వరరావు తెలిపారు. చిన్నారిని చంపిన చిరుతల నమూనా తెలుసుకునేందుకు మరో వారం రోజుల్లో రిపోర్టులు వస్తాయని ఆయన వెల్లడించారు.