ఏపీలో వైద్య ఆరోగ్యశాఖలో ఖాళీలు భర్తీకి నోటిఫికేషన్

ప్రభుత్వం ఏర్పాటు చేసిన తొలినాళ్లలోనే లక్షల్లో ఉద్యోగాలు కల్పించిన ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహేన్ రెడ్డి తాజాగా మరో నోటిఫికేషన్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు.

Update: 2020-06-09 04:13 GMT
YS Jagan (File Photo)

ప్రభుత్వం ఏర్పాటు చేసిన తొలినాళ్లలోనే లక్షల్లో ఉద్యోగాలు కల్పించిన ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహేన్ రెడ్డి తాజాగా మరో నోటిఫికేషన్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం కరోనా నేపథ్యంలో వైద్య ఆరోగ్యశాఖలో పూర్తిస్థాయిలో ఖాళీలు భర్తీ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దీనిపై ఇప్పటికే సంబంధిత అధికారులతో మాట్లాడిన సీఎం ఈ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

కరోనా వైరస్ కట్టడిలో భాగంగా ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వైరస్ నియంత్రణ పట్ల ప్రజల్లో అవగాహన కల్పించాలని.. ఇందుకోసం వాలంటీర్ వ్యవస్థ విస్తృతంగా ప్రచారం చేయాలని అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. కరోనా నివారణ చర్యలపై తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన పైవిధంగా నిర్ణయం తీసుకున్నారు. రాబోయే 2,3 వారాలు చాలా కీలకమని, ప్రజల్లో కరోనాపై అపోహలు, భయాలు తొలగించే విధంగా వీలైనంత ఎక్కువగా ప్రచారం చేయించాలని అధికారులకు సూచించారు. ఒకవేళ కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయితే.. అప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వైద్యంపై అవగాహన కల్పించాలన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కోవిడ్ క్లస్టర్ల వివరాలను సీఎం అడిగి తెలుసుకున్నారు.

కరోనాపై పోరులో ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎంల సహకారం తీసుకోవాలన్న ఆయన.. వెంటనే వైద్యారోగ్య శాఖలోని ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. అలాగే అంతర్రాష్ట్ర రాకపోకల వివరాలు గురించి కూడా తెలుసుకున్నారు. ముఖ్యంగా కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న 6 రాష్ట్రాల నుంచి వచ్చేవారిపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు తెలిపారు. కాగా, జిల్లాల వారీగా 71 సెంటర్లలో 15,614 బెడ్లను సిద్దం చేసినట్లు అధికారులు సీఎం జగన్‌కు వెల్లడించారు. బోధనాస్పత్రులు, సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా ఆసుపత్రులు, జిల్లా ఆసుపత్రులు, ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల్లో ఖాళీగా ఉన్న 9700 పోస్టులను భర్తీ చేసేందుకు గతంలోనే సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి విదితమే. ఈ పోస్టులకు త్వరలోనే నోటిఫికేషన్ జారీ చేయనున్నారు.


Tags:    

Similar News