AP Government on Land Value Increase: భూముల విలువ పెంపునకు ఓకే.. ఆగష్టు ఒకటి నుంచి అమలు

AP Government on Land Value Increase: నిర్మాణాల విలువ పెంచిన ఏపీ ప్రభుత్వం ఆగష్టు ఒకటి నుంచి భూముల విలువను పెంచేందుకు ఏర్పాట్లు చేస్తోంది.

Update: 2020-07-26 03:30 GMT
Land Value Increase

AP Government on Land Value Increase: నిర్మాణాల విలువ పెంచిన ఏపీ ప్రభుత్వం ఆగష్టు ఒకటి నుంచి భూముల విలువను పెంచేందుకు ఏర్పాట్లు చేస్తోంది. వీటి విలువ పెరడంతోనే రిజిస్ట్రేషన్ విలువ పెరిగి, ప్రభుత్వానికి ఆదాయం సమకూరే అవకాశం ఉంటుంది. రాష్ట్రంలోని భూముల మార్కెట్ విలువలను భారీగా పెంచేందుకు ఏపీ ప్రభుత్వం సిద్దమైనట్లు కనిపిస్తోంది. పట్టణాలు, నగరాలలోని వ్యవసాయ భూములు, అపార్ట్‌మెంట్లు, ఖాళీ స్థలాల విలువను ఆగష్టు 1 నుంచి పెంచనుంది. ఆయా ప్రాంతాల డిమాండ్లను బట్టి 5 నుంచి 50 శాతం వరకు ధరలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. రెండు లేదా మూడు రోజుల్లో దీనికి సంబంధించి మార్గదర్శకాలు విడుదల కానున్నాయి. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ఆదేశాలు ఇవ్వకపోతే.. స్థానిక సబ్ రిజిస్ట్రార్లు ప్రతిపాదించిన ధరలు అమలులో రానున్నాయి. కాగా, కరోనా వైరస్ దెబ్బతో ఏప్రిల్, మే నెలల్లో రిజిస్ట్రేషన్లు భారీగా తగ్గిన సంగతి తెలిసిందే.

ఇక ఇప్పటికే నిర్మాణాల మార్కెట్ విలువ పెంపుపై రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసింది. ఆర్‌సీసీ భవనాలు, రేకుల షెడ్లు, పౌల్ట్రీలు ఇలా అన్ని రకాల కట్టుబడి విలువలను సవరించింది. వాటి మార్కెట్ విలువను చదరపు అడుగుకు రూ. 20-40 వరకు పెంచింది. అటు గ్రామాల్లో నిర్మాణాల ధరలను రూ. 20 నుంచి రూ. 30 వరకు పెంచింది. పూరి గుడిసెలకు ఎలాంటి పెంపు లేదని స్పష్టం చేసింది. 

Tags:    

Similar News