Ambati Rambabu: జైలులో చంద్రబాబు నిరాహార దీక్ష సిగ్గుచేటు
Ambati Rambabu: టీడీపీ, జనసేనలపై మంత్రి అంబటి విమర్శలు
Ambati Rambabu: టీడీపీ చేపట్టిన దీక్షలపై మంత్రి అంబటి రాంబాబు విమర్శలు చేశారు.అవినీతి కేసులో ఉండి జైలులో చంద్రబాబు నిరాహార దీక్ష చేయడం సిగ్గుచేటు అని విమర్శించారు. ఇటు జనసేన చీఫ్ పవన్‌పై కూడా విమర్శలు చేశారు మంత్రి అంబటి. అవనిగడ్డలో జనసేన నిర్వహించిన సభ అట్టర్ ప్లాఫ్ అయిందని ఎద్దేవా చేశారు. పవన్‌కల్యాణ్ రాజకీయాలకు పనికిరాడని కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీతో పవన్ కలవడం వల్ల కాపులు ఈ సభకు రాలేదన్నారు అంబటి. అసలు పవన్ బీజేపీతో ఉన్నారా లేదా అనేది క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు అవినీతి డబ్బుతోనే జనసేన పార్టీని నడిపిస్తున్నారని ఆరోపించారు మంత్రి అంబటి రాంబాబు.