Ambati Rambabu: సాగర్ కుడికాలువను తెలంగాణ ఆపరేట్ చేయడం చట్టవిరుద్ధం
Ambati Rambabu: తెలంగాణలో ఏ పార్టీనో గెలిపించాల్సిన అవసరం మాకు లేదు
Ambati Rambabu: నాగార్జున సాగర్ నీటి విడుదల అంశంలో.. ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు తమ చర్యలను సమర్థించుకున్నారు. తమకు రావాల్సిన నీటి వాటాపై తెలంగాణ అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు. తెలంగాణ దయతో తమ రైతులకు నీళ్లు ఇవ్వాలా.. అంటూ అంబటి ప్రశ్నించారు. కృష్ణా నదిలో 66 శాతం వాటా ఏపీకి చెందుతుందని.. ఆ నీటినే తాము వాడుకుంటున్నామని.. స్పష్టం చేశారు.
తమది కాని ఒక్క బొట్టు కూడా అవసరం లేదని అంబటి తేల్చేశారు. తెలంగాణలో ఏ రాజకీయ పార్టీని గెలిపించాలనో.. ఓడించాలనో ఉద్దేశం తమకు లేదన్నారు. తెలంగాణ రాజకీయాలు వేరు.. ఆంధ్ర రాజకీయాలు వేరని స్పష్టం చేశారు. నీటిని పంచుకున్న తర్వాత వాటిని వాడుకునే స్వేచ్ఛను ఇవ్వాలని.. మంత్రి అంబటి రాంబాబు కోరారు..