Ambati fires on pawan: వారి గురించి మాట్లాడే అర్హత పవన్‌కు లేదు : అంబటి రాంబాబు
Ambati fires on pawan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు..
ambati fires on pawan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు.. తాజాగా పవన్ కళ్యాణ్ కాపులపై శ్వేత పత్రం విడుదల చేయాలంటూ జగన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే.. అయితే ఇదే అంశం పైన శనివారం స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అయన మాట్లాడుతూ.. కాపు సామాజిక వర్గాన్ని పచ్చి మోసం చేసిన చంద్రబాబును పవన్ ఆనాడు ఎందుకు ప్రశ్నించలేదని అంటూ అంబటి రాంబాబు ఈ సందర్భంగా ప్రశ్నించారు.
అప్పట్లో చంద్రబాబు చేసిన మోసాలు పవన్ కళ్యాణ్ కి గుర్తులేవా అంటూ అంబటి ప్రశ్నించారు. ఏడాదికి రూ. వెయ్యి కోట్ల చొప్పున ఐదేళ్లలో రూ. ఐదు వేల కోట్లు ఇస్తామని చెప్పిన చంద్రబాబు మొత్తం ఐదేళ్లలో కాపులకు ఖర్చుచేసింది కేవలం రూ. 1800 కోట్లు మాత్రమేనని అంబటి ఎద్దేవా చేశారు. చంద్రబాబు హయంలో కాపులపై తప్పుడు కేసులు పెట్టినప్పుడు పవన్ ఎక్కడ ఉన్నారని, అప్పుడు మాట్లాడని పవన్ ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నారని అంబటి ప్రశ్నించారు. కాపులపై చంద్రబాబు తప్పుడు కేసులు పెడితే సీఎం జగన్ వాటిని ఎత్తివేశారని అంబటి అన్నారు.
ఇక కాపు మహిళలకు అండగా ఉండేందుకు సీఎం జగన్ 'వైఎస్సార్ కాపు నేస్తం' అనే కార్యక్రమాన్ని ప్రారంభించారని, వాస్తవానికి ఇది మేనిఫెస్టోలో పెట్టలేదని అయినప్పటికీ ఆ సామాజిక వర్గానికి చెందిన మహిళలకు మేలు చేయాలనే ఉద్దేశంతోనే సీఎం జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారని అంబటి అన్నారు. దీనికి అర్హత ఉన్న ప్రతి ఒక్కరు దరఖాస్తు చేసుకోవాలని ఇవ్వడానికి ప్రభుత్వం సిద్దంగా ఉందని అన్నారు. ఇక కాపుల గురించి మాట్లాడే అర్హత పవన్‌కు లేదు అంటూ అంబటి వాఖ్యానించారు.