కోవిడ్ వ్యాక్సినేషన్‌పై ఏఈఎఫ్‌ఐ అధికారుల సమీక్షా
*తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారుల చర్చ *ముందుగా అంగీకార పత్రం తీసుకోవాలని నిర్ణయం *ఏపీలో 1లక్షా 40వేల మందికి టీకా : ఏఈఎఫ్‌ఐ డైరెక్టర్ గీతా ప్రసాదిని
కోవిడ్ వ్యాక్సిన్ వికటించి ఆశ వర్కర్ విజయలక్ష్మి చనిపోయిన ఘటనపై ఏఈఎఫ్‌ఐ అధికారులు సమీక్షించారు. వ్యాక్సిన్ వేయాడానికి ముందు.. వేసిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సుధీర్ఘంగా చర్చించారు. వ్యాక్సిన్ వేయాలంటే ముందుగా వారి వద్దనుంచి అంగీకారపత్రం తప్పనిసరిగా తీసుకోవాలని నిర్ణయించారు. రాష్ట్ర వ్యాప్తంగా 1లక్షా 40 వేల మందికి వ్యాక్సిన్ వేసినట్లు ఏఈఎఫ్‌ఐ డైరెక్టర్ గీతా ప్రసాదిని వెల్లడించారు. అయితే వీరిలో కొంతమందికి చిన్న చిన్న ఇబ్బందులు ఎదురయ్యాయని అది పెద్ద సమస్య కాదని ఆమె సూచించారు.