Nellore: గణేష్ ఘాట్‌లో ప్రమాదం.. తెగిన రోప్ వైర్.. విగ్రహంతో పాటు చెరువులో పడిపోయిన యువకులు

Nellore: గాయపడినవారిని 108 ద్వారా ఆస్పత్రికి తరలింపు

Update: 2023-09-24 06:15 GMT

Nellore: గణేష్ ఘాట్‌లో ప్రమాదం.. తెగిన రోప్ వైర్.. విగ్రహంతో పాటు చెరువులో పడిపోయిన యువకులు

Nellore: నెల్లూరు నగరంలోని గణేష్ ఘాట్‌లో ప్రమాదం జరిగింది. విగ్రహాలను నిమజ్జనం చేస్తుండగా ఒకసారిగా రోప్ వైర్ తెగిపోయింది. దీంతో వినాయకుడి నిమజ్జనం చేస్తున్న నలుగురు యువకులు విగ్రహంతో పాటు చెరువులో పడిపోయారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు గజ ఈతగాళ్ల సహాయంతో యువకులను కాపాడారు. క్రేన్ రోప్ ఒక్కసారిగా తెగిపోవడంతో అక్కడున్న వారంతా షాక్‌కు గురయ్యారు. గాయపడ్డవారిని 108 వాహనం ద్వారా జీజీహెచ్‌కు తరలించారు. క్రేన్ ప్రమాద ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    

Similar News