CM Jagan: ఎల్లుండి విజయవాడలో వైసీపీ పధాదికారుల సమావేశం
CM Jagan: మార్కెట్ యార్డ్ చైర్మన్లు, ఎంపీపీలు సహా పలువురు ప్రతినిధులు
CM Jagan: ఎల్లుండి విజయవాడలో వైసీపీ పధాదికారుల సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి రాష్ట్ర నలుమూలల నుంచి పార్టీ శ్రేణులు హాజరుకానున్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, పార్టీ కో-ఆర్డినేటర్లు, సమన్వయకర్తలు, మున్సిపల్ చైర్మన్లు, మార్కెట్ యార్డ్ చైర్మన్లు, ఎంపీపీలు సహా పలువురు ప్రతినిధులు.. ఈ సమావేశానికి హాజరవుతారు. మొత్తం 8 వేల 2 వందల 22 మంది హాజరయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ సమావేశంలో ఎన్నికలకు క్యాడర్‌ను సమాయత్తం చేయనున్నారు పార్టీ అధినేత జగన్. అలాగే.. రానున్న రోజుల్లో నిర్వహించాల్సిన కార్యక్రమాలపై కూడా నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు పార్టీ అధినేత.