Ganja Trafficking Gang: 208 కిలోల గంజాయి పట్టివేత.. ఐదుగురు సభ్యుల ముఠా అరెస్టు
Ganja Trafficking Gang: హైదరాబాద్‌లో ఐదుగురు ముఠాను అరెస్ట్ చేసిన పోలీసులు
Ganja Trafficking Gang: విజయనగరం నుంచి మహారాష్ట్రకు లారీలో గంజాయి తరలిస్తున్న ఐదుగురు సభ్యుల ముఠాను హైదరాబాద్‌లో పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి 208 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. పోలీసులతో కలిసి టీఎస్ నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో అధికారులు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించి ప్రణాళిక ప్రకారం నిందితులను పట్టుకున్నారు. ఈ మేరకు వివరాలను టీఎస్ న్యాబ్ ఎస్పీ సునీతారెడ్డి వెల్లడించారు.