హైకోర్టు ఆదేశాలతో మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావుపై కేసు నమోదు చేశారు. యరపతినేని సహా మొత్తం 12 మందిపై కేసులు నమోదయ్యాయి. మైనింగ్ ఏడీ జగన్నాథరావు, ఆర్డీవో మురళి, సీఐ హనుమంతరావుపై కేసులు నమోదయ్యాయి. 2015లో అక్రమ మైనింగ్ తవ్వకాలపై గురవాచారి ఉమ్మడి హైకోర్టులో కేసు వేశారు. అయితే ఎమ్మెల్యే యరపతినేని తనను పోలీసులతో కొట్టించి, కేసు నమోదు చేయించాడని ఆరోపించారు. ఈ దాడిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.