Visakhapatnam: విశాఖలో బాలుడి హత్య.. గొంతు కోసి గోనెసంచిలో చుట్టి సముద్రంలో పడేసిన దుండగులు

Visakhapatnam: నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు

Update: 2023-09-23 10:29 GMT

Visakhapatnam: విశాఖలో బాలుడి హత్య.. గొంతు కోసి గోనెసంచిలో చుట్టి సముద్రంలో పడేసిన దుండగులు

Visakhapatnam: విశాఖ సాగర తీరంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ బాలుడ్ని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. ఈ హత్య ఘటన విశాఖ సిటీలో కలకలం సృష్టించింది. బాలుడి డెడ్‌బాడీని గోనెసంచిలో చుట్టి ఫిషింగ్ హార్బర్ సముద్రంలో విసిరేశారు గుర్తు తెలియని వ్యక్తులు. సమాచారం తెలుసుకున్న వన్‌టౌన్ పోలీసులు మృతదేహం లభ్యమైన చోట వివరాలు సేకరిస్తున్నారు. బాలుడి డెడ్‌బాడీ పోస్టుమార్టం కోసం విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. ఘటనలో నలుగురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Tags:    

Similar News