AP News: ఏపీలో త్వరలో 5 కొత్త వైద్య కళాశాలలు ఏర్పాటు
AP News: 70 ఎకారాల్లో రూ.500 కోట్లతో నిర్మాణం
AP News: ఈ సంవత్సరం సెప్టెంబరు నుంచి రాష్ట్రంలోని ఐదు కొత్త వైద్య కళాశాలల్లో మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని వైద్య శాఖ మంత్రి విడదల రజని తెలిపారు. విజయనగరం, రాజమండ్రి, మచిలీపట్నం, ఏలూరు, నంద్యాలలో మెడికల్ కళాశాలల్లో ఈ విద్యా సంవత్సరం నుంచే తరగతులు ప్రారంభించేందుకు అనుమతు లబించాయన్నారు. విజయనగరం వైద్య కళాశాల నిర్మాణం పనులు శరవేగంగా జరుతుండటం సంతృప్తికరంగా ఉందన్నారు.
70 ఎకరాల విస్తీర్ణంలో 500 కోట్ల రూపాయలతో విజయనగరంలో వైద్య కళాశాల నిర్మిస్తున్నట్టు తెలిపారు. ఈ ఐదు కళాశాలల ప్రారంభం ద్వారా రాష్ట్రంలో ఆయా ప్రాంతాల్లో ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులోకి రావడంతోపాటు ఎం.బి.బి.ఎస్. చదవాలనుకున్న పేద విద్యార్ధులకు వైద్య విద్య అందుబాటులోకి వస్తుందని తెలిపారు. రాష్ట్రంలో 8500 రూపాయలతో కోట్లతో 17 వైద్య కళాశాలల్ని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారన్నారు.