AP News: ఏపీలో భారీగా ఐపీఎస్‌ల బదిలీలు
AP News: ఏపీ ప్రభుత్వం భారీగా ఐపీఎస్‌లను బదిలీ చేసింది.
AP News: ఏపీ ప్రభుత్వం భారీగా ఐపీఎస్‌లను బదిలీ చేసింది. ఇప్పటికే 56 మంది ఐఏఎస్‌లను బదిలీ చేసిన ప్రభుత్వం.. తాజాగా 39 మంది ఐపీఎస్‌లను బదిలీ చేసింది. ఈ బదిలీలకు సంబంధించి రెండు జీవోలు జారీ చేసింది. అమరావతి. ఏలూరు రేంజ్ డీఐజీగా జీవీజీ అశోక్ కుమార్‌ను నియమించింది. గుంటూరు రేంజ్ ఐజీగా పాల రాజును.. అనంతపురం రేంజ్ డీఐజీగా R.N.అమ్మి రెడ్డి.. సెబ్ డీఐజీగా రవి ప్రకాశ్, ఏపీఎస్పీ డీఐజీగా రాజకుమారి, డీజీపీ ఆఫీస్ అడ్మిన్ డీఐజీగా సర్వశ్రేష్ఠ త్రిపాఠిని నియమించింది.
ఇక గ్రే హౌండ్స్ డీఐజీగా కోయ ప్రవీణ్, లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీగా శంక బ్రత బాగ్చి, విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అడిషనల్ డీజీగా రవి శంకర్ అయ్యనార్‌ను నియమించారు. పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు ఛైర్మన్‌గా అతుల్ సింగ్‌ను నియమిస్తూ.. ఏపీ ఎస్పీ అడిషనల్ డీజీగానూ ఆయనకు అదనపు బాధ్యతలు అప్పజెప్పింది. మనీష్ కుమార్ సిన్హాను జీఏడీకి రిపోర్ట్ చేయాలని తెలిపింది. సీఐడీకి ఐజీగా శ్రీకాంత్‌ను...పోలీస్ హౌసింగ్ కార్పొరేషణ్ ఎండీగా పి. వెంకట్రామిరెడ్డి.. విశాఖ సిటీ కమిషనర్‌గా సీఎం త్రివిక్రమ్ వర్మ.. పార్వతీపురం మన్యం ఎస్పీగా విక్రాంత్ పాటిల్‌ను నియమించింది ప్రభుత్వం.
ఇక విశాఖ సిటీ లా అండ్ ఆర్డర్ డీసీపీగా వాసన్ విద్యా సాగర్ నాయుడు, అల్లూరి జిల్లాకు ఎస్పీగా తుహిన్ సిన్హా, కాకినాడ జిల్లా ఎస్పీగా ఎస్.సతీష్ కుమార్, అనకాపల్లి జిల్లా ఎస్పీగా కేవీ మురళి కృష్ణ, తూర్పుగోదావరి జిల్లా ఎస్పీగా సుధీర్ కుమార్ రెడ్డి, ఏలూరు జిల్లా మేరీ ప్రశాంతి, నెల్లూరు జిల్లా ఎస్పీగా తిరుమలేశ్వర్ రెడ్డిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అన్నమయ్య జిల్లా ఎస్పీగా గంగాధర్ రావు, అనంపురం ఎస్పీగా శ్రీనివాసరావు, సత్యసాయి జిల్లా ఎస్పీగా ఎస్వీ మాధవ్‌రెడ్డి, విజయవాడ రైల్వే ఎస్పీగా రాహుల్‌దేవ్ సింగ్‌ను నియమించింది ప్రభుత్వం.