Andhra Pradesh: 16 మంది ఐపీఎస్ ల బదిలీ

Andhra Pradesh: 16 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది.

Update: 2021-07-07 02:18 GMT

16 IPS Officers Transferred in AP State

Andhra Pradesh: 16 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. వారిలో కొంతమందికి పదోన్నతిని కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అదిత్యనాథ్ దాస్ మంగళవారం అర్థరాత్రి తర్వాత జీవో జారీ చేశారు.

ఎవరు ఎక్కడంటే..

విజయనగరం ఎస్పీ రాజకుమారికి దిశ డీఐజీగా పదోన్నతి లభించింది. దీంతోపాటు డీజీపీ కార్యాలయంలో అడ్మిన్ డీఐజీగానూ రాజకుమారికి బాధ్యతలు అప్పగించారు. విజయనగరం ఎస్పీగా ఎం.దీపిక బదిలీ అయ్యారు. సి.హెచ్.విజయరావు నెల్లూరు ఎస్పీగా బదిలీ అయ్యారు. ఎం.రవీంద్రనాథ్ బాబు తూర్పు గోదావరి జిల్లా ఎస్పీగా బదిలీ అయ్యారు. అద్నాన్ నయీమ్ హస్మిని గ్రే హౌండ్స్ కమాండర్‌గా బదిలీ. కృష్ణా జిల్లా ఎస్పీగా సిద్ధార్థ్‌ కౌశల్‌‌ను బదిలీ అయ్యారు. వై. రిశాంత్‌రెడ్డి గుంటూరు రూరల్ అడ్మిన్‌ అదనపు ఎస్పీగా బదిలీ. సతీశ్‌కుమార్‌ స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో అదనపు ఎస్పీగా బదిలీవిద్యాసాగర్‌ నాయుడు స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో అదనపు ఎస్పీగా పోస్టింగ్‌విద్యాసాగర్ నాయుడు ఎస్ఈబీ అదనపు ఎస్పీగా నియమకం. గరికపాటి బిందు మాధవ్ను ఎస్ఈబీ అదనపు ఎస్పీగా బదిలీ అయ్యారు. తుహిన్ సిన్హాను ఎస్ఈబీ అదనపు ఎస్పీగా బదిలీ చేశారు. పి జగదీష్ విశాఖపట్నం జిల్లా, పాడేరు ఏఎస్పీగా బదిలీ అయ్యారు. జి కృష్ణకాంత్తూర్పుగోదావరి జిల్లా, చింతూర్ ఏఎస్పీగా బదిలీ అయ్యారు. విఎన్. మణికంఠ చందోలు విశాఖపట్నం జిల్లా, నర్సీపట్నం అసిస్టెంట్ ఎస్పీగా బదిలీ అయ్యారు. కృష్ణకాంత్ పాటిల్ తూర్పుగోదావరి జిల్లా, రంపచోడవరం అసిస్టెంట్ ఎస్పీగా బదిలీ అయ్యారు. తుషార్ దూడిని విశాఖపట్నం జిల్లా, చింతపల్లి అసిస్టెంట్ ఎస్పీగా బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Tags:    

Similar News