AP Corona Cases: ఏపీలో కొత్తగా 11,434 కరోనా కేసులు, 64 మంది మృతి

AP Corona Cases: ఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతోంది.

Update: 2021-04-27 13:28 GMT

కరోనా వైరస్ ప్రతీకాత్మక చిత్రం

AP Corona Cases: ఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. భారీగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 11 వేల 434 పాజిటివ్ కేసులు నమోదు కాగా 64 మంది మృతి చెందారు. విజయనగరం జిల్లాలో అత్యధికంగా 8 మంది, అనంతపురం, తూర్పుగోదావరి, గుంటూరు, నెల్లూరు, శ్రీకాకుళం జిల్లాల్లో ఆరుగురు చొప్పున, చిత్తూరులో ఐదుగురు, కర్నూలు, ప్రకాశం, విశాఖపట్నం, పశ్ఛిమగోదావరి జిల్లాల్లో నలుగురు చొప్పున మృతి చెందారు. కృష్ణా జిల్లాలో ముగ్గురు, కడప జిల్లాలో ఇద్దరు కరోనా కాటుకు బలయ్యారు.

ఏపీలో గడిచిన 24గంటల్లో 74వేల 435 మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించగా వారిలో 11వేల 434 మందికి పాజిటివ్ గా నిర్దారణ అయింది. దీంతో మొత్తం ఇప్పటి వరకు పది లక్షల 54 వేల 875 మంది కరోనా భారీన పడినట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. రాష్ర్ట వ్యాప్తంగా ఒక కోటి 61 లక్షల 43 వేల 83 మంది నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది.

రాష్ట్రంలో కరోనాతో మరణించి వారి సంఖ్య ఏడు వేల 800 కు చేరింది. గడిచిన 24 గంటల వ్యవధిలో ఏడు వేల 55 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ర్టం 99 వేల446 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కొత్తగా నమోదు అయిన కేసుల్లో అత్యధికంగా గుంటూరు జిల్లాలో రెండు వేల 28 కేసులు నమోదు కాగా.. అత్యల్పంగా తూర్పు గోదావరి జిల్లాలో 253 మంది వైరస్ భారీన పడ్డారు. ఇక చిత్తూరూ జిల్లాలో ఒక వెయ్యి 982 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. శ్రీకాకుళంలో ఒక వెయ్యి 322, విశాఖపట్నంలో ఒక వెయ్యి 67, నెల్లూరులో ఒక వెయ్యి 237, కృష్ణా జిల్లాలో 544, విజయనగరం జిల్లాలో 633, కర్నూలు జిల్లాలో 474, పశ్చిమగోదావరి జిల్లాలో 424 కేసులు నమోదయ్యాయి.


Tags:    

Similar News