ఒక్క కమలమైనా వికసించింది కానీ... ఈ మధ్య సభలో కమిలిపోతోంది. ఎందుకలా? దేశమంతా కాషాయమే. ఎక్కడ చూసినా కమలనాథులే. కదంతొక్కాలన్న ఆతృతతో ఉన్న కాషాయదళం తెలుగు రాష్ట్రాల్లో కాస్త కలవరపడుతోందా? అందులో మరీ ముఖ్యంగా తెలంగాణ మొన్నీ మధ్య ప్రారంభమైన అసెంబ్లీ సాక్షిగా కమిలిపోతోందా? కేంద్రంలో అధికారంలో ఉన్న కమలాన్ని కల్లోలపరుస్తూ... ఇక్కడి రెండు ప్రధాన పార్టీలు చెడుగుడు ఆడేస్తున్నాయా? చట్టసభ సాక్షిగా అయ్యో పాపం అని జాలిపడే స్థితికి తీసుకెళ్లున్నాయా? తెలంగాణ అసెంబ్లీలో ఒకే ఒక్కడుగా ఉన్న కమలనాథుడు భాష తెలియక, భావం అర్థంకాక కౌంటర్ ఇవ్వలేకపోతున్నారా? డిటెయిల్స్ తెలియక సైలెంట్ అవుతున్నారా? ఇంతకీ ఆ కమల పార్టీ ప్రతినిధికి ఏమైంది? ఎందుకిలా మౌనంగా ఉంటున్నారు.?