సీఎం జగన్‌కు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. న్యాయమూర్తులపై ఆరోపణలు చేస్తూ లేఖ రాయడం, లేఖ బహిర్గతం చేయడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంలో పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లపై జస్టిస్ లలిత్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. అయితే విచారణ ధర్మాసనం నుంచి జస్టిస్ లలిత్ కుమార్ తప్పుకున్నట్లు ప్రకటించారు. ఈ కేసును మరో ధర్మాసనానికి బదిలీ చేయాలని జస్టిస్ లలిత్ కుమార్ సూచించారు.