Jonnalagadda Jyothi: ఉమ్మడి కుటుంబాల ఊసే లేదు
Matrimony: అసలు ఇప్పటి యువతకి ఉమ్మడి కుటుంబాలంటే అర్ధమే తెలీదు.
Matrimony: అసలు ఇప్పటి యువతకి ఉమ్మడి కుటుంబాలంటే అర్ధమే తెలీదు. దీనివల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో తెలియచెప్పే పెద్దలు కూడా కరువయ్యారు. ఇదీ మన దౌర్భాగ్యం. ఇదివరకు అమ్మమ్మలు, నాయనమ్మల దగ్గిర పెరిగిన పిల్లలు ఇప్పుడు తల్లితండ్రుల దగ్గిర కూడా ఎక్కువకాలం ఉండలేని స్థితికి వచ్చేసారు. ఎక్కడికి దిగజారిపోతున్నాం మనం. వివాహం కాకముందు అమ్మాయిలు న్యూక్లియర్ ఫామిలీ కావాలని, అబ్బాయిలు తల్లితండ్రులను వృద్ధాశ్రమాల్లో ఒదిలేద్దామని కోరుకుంటున్నారు తప్పితే అసలు ఉమ్మడి కుటుంబాల జాడే లేదు.
ఇక ముందు కూడా ఉంటుందని ఊహించనూ అక్కర్లేదు. ఇద్దరిలో ఒకరికి బాధకలిగితే ఓదార్చే నాధుడు లేడు, ఒకరు జబ్బు పడితే చేసే దిక్కు లేదు, పురాణ వాక్యాలు, మంచిమాటలు చెప్పి ఊర్ధదించే పెద్ద దిక్కు ఉండదు, డబ్బు పరంగా ఇబ్బంది వస్తే ఆదుకునే నాధుడు లేడు, మానసికమైన రుగ్మతలు వస్తే ఊరడించే అనుభవజ్ఞులు లేరు. ఇవే కదా ఇన్ని Divorces అవడానికి కారణాలు. ఈ విషయంలో శ్రీమతి జొన్నలగడ్డ జ్యోతి గారు ఏం చెబుతారో చూద్దాం. అలాగే మీ Mobile Phone లో Telegram App ని Download చేసుకుని Matrimony India Channel లో Join అవ్వండి. మీరు మెచ్చిన, మీకు నచ్చిన సంబంధం ఉచితంగా చూసుకుని మాట్లాడుకోవచ్చు.