జానపదాల ఒరవడిలో బావా మరదళ్ల సరసాలు!

జానపద గీతాల్లో సరసమైన పాటలకు ఓ ప్రత్యేకత ఉంటుంది. అందులోనూ బావా మరదళ్ల మధ్య అనుబంధాన్ని చెబుతూ వచ్చే జానపదాలు జనబాహుళ్యానికి ఇట్టే చేరువవుతాయి.

Update: 2021-01-16 11:04 GMT

జానపద గీతాల్లో సరసమైన పాటలకు ఓ ప్రత్యేకత ఉంటుంది. అందులోనూ బావా మరదళ్ల మధ్య అనుబంధాన్ని చెబుతూ వచ్చే జానపదాలు జనబాహుళ్యానికి ఇట్టే చేరువవుతాయి. మరదలితో బావ చేసే సరసం.. ఆ మరదలు చేసే అల్లరి అన్నీ మన రచయితలు కొన్ని వందల గీతాల్లో కూర్చి శ్రోతల మనసుల్ని రంజింప చేశారు.

బావా మరదళ్ల మధ్య సంబంధంలో ఉండే సరసం.. ఆ సరసంలో ఉండే మొరటు తనాన్ని సున్నితంగా తమ పాటల్లో నింపి వీనుల విందు చేశారు ఎందరో రచయితలు.

అటువంటిదే ఓ సరసమైన జానపదం మీకోసం అందిస్తోంది హెచ్ఎంటీవీ..

మీది మీది కొస్తవు .. మీసాలె తిప్పుతావు అంటూ బావతో సయ్యటలాడుతున్న ఈ భామను చూడండి..

Full View

వర్ధమాన గాయని ఐశ్వర్య పాడిన ఈ పాట కడారి శ్రీనివాస్ రాశారు. ఎల్ఎం ప్రేమ్ సంగీతాన్ని అందించారు. లక్కీ ఎకారి దర్శకత్వ పర్యవేక్షణలో బ్రహ్మం నృత్యరీతులు కూర్చగా ప్రశాంత్ వర్మ కెమెరాలో బంధించారు.

ఈ పాట లిరిక్స్ ఇవిగో..

పల్లవి:-

మీద మీద కొస్తవు మీసాలే తిప్పుతవు.. గీ దెంది మావ...

కన్నేమో కొడతవు.. సైగలేవో జెత్తవు.. సంగతీ ఎంది మళ్ళా.2

నే కన్ను కొడితే పడను...

నే సైగ చెస్తే రాను... గసొంటి దాన్ని కాదురా....

తల్లి చాటు పిల్ల ను.. పల్లె పడుచు దానను.. గట్ల నువ్వు పిలువకుర....2

1) చరణం:-

మంచి నీళ్ళ బాయి కాడ వంగి కడవెత్తుతుంటే...2

కారడ్డ మాడు డెంది రా..2

కళ్ళలో కళ్ళు పెట్టి సంపుడెంది రా.....2

2) చరణం:-

జొన్న సేను కాడి కెళ్ళి... జొన్న కంకి కొయ్యబొ తే...2

కస్సు బస్సు లాడుడెంది రా 2 కందిరీగ లెక్క నువ్వు గుట్టుడెంది రా..

Tags:    

Similar News