దుబ్బాకలో ఉపఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. చిట్టాపూర్ లో టీఆర్ఎస్ అభ్యర్ధి సోలిపేట సుజాత, బొప్పాపూర్ లో బీజేపీ అభ్యర్ధి రఘునందన్ రావు, తుక్కాపూర్ లో కాంగ్రెస్ అభ్యర్ధి చెరుకు శ్రీనివాసరెడ్డి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలింగ్ కేంద్రాల దగ్గర ఓటర్లు బారులు తీరారు. మాస్క్, గ్లౌస్ లు ధరించి బౌతిక దూరం పాటిస్తూ ఓటర్ వేస్తున్నారు. సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ జరగనుంది. సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు కొవిడ్ బాధితుల కోసం ప్రత్యేక సమయం కేటాయించారు.