హైదరాబాద్‌లో కుట్ర కేసును భగ్నం చేసిన సిటీ పోలీసులు
Hyderabad: ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ నేతలపై దాడులు, పేలుళ్లకు కుట్ర చేసిన జాహిద్
Hyderabad: హైదరాబాద్‌లో టెర్రర్ కుట్రను పోలీసులు భగ్నం చేశారు. ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ నేతలతో పాటు పేలుళ్లకు జాహిద్ కుట్ర చేశాడు. ఉగ్రవాద కార్యక్రమాల కోసం యువకులను జాహిద్ రిక్రూట్‌మెంట్ చేశాడు. ఇప్పటికే ఆరుగురు యువకులను ఉగ్రవాద సంస్థల కోసం జాహిద్ రిక్రూట్ చేశాడు. హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు జాహిద్‌ను అదుపులోకి తీసుకున్నారు. గతంలో మక్కా మసీదు పేలుళ్ల కేసులో సైతం జాహిద్‌ను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. జాహిద్ పోలీస్ కస్టడీ లో ఉన్నాడా? అతన్ని ఏ కేసులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారో తెలియదని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.