నోరు మూసుకునే కన్నా, చావడం మిన్న: వైసీపీ నేత పీవీపీ ఆసక్తికర ట్వీట్

Update: 2020-06-25 05:02 GMT

వైసీపీ నేత పీవీపీని బంజారాహిల్స్ పోలీసులు మరోసారి విచారించే అవకాశం ఉంది. విల్లా గొడవలో దౌర్జన్యంగా ప్రవర్తించిన పీవీపీపై కేసు నమోదు చేసిన పోలీసులు..41 సీఆర్పిసి కింద నోటీసులు జారీ చేశారు. గురువారం విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు. నిన్న రాత్రి పీవీపీకి బంజారాహిల్స్ పోలీసులు నోటీసులల్లో పేర్కొన్నారు.

పీవీపీ ట్విట్టర్ వేదికగా స్పందించారు. తప్పు జరిగితే ప్రశ్నిచడం పెద్ద తప్పు అయితే మౌనంగా ఉండడం కంటే చనిపోవడం మంచిది అని పీవీపీ కామెంట్స్ చేసారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ లో "తప్పు ని తప్పు అనడం తప్పు అయితే, ఆ తప్పు ఎన్ని లక్షల సార్లు అయినా చేయవచ్చు నోరు మూసుకునే కన్నా, చావడం మిన్న " అంటూ భావోద్వేగ ట్వీట్ చేశారు.

అంతకుముందు బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 14 లో గోడవివాదంలో.. కైలాష్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఆయనపై కేసు నమోదు చేశారు. ఏడాది క్రితం పివిపి విల్లాస్‌లో ఇళ్లు కొనుగోలు చేశారు కైలాష్. అయితే ఆ సమయంలో ఎలాంటి రూల్స్ పెట్టకుండా విక్రయించారు అంటున్నారు ఆయన… కానీ ఇప్పుడు టెర్రస్‌పై గార్డెన్‌ నిర్మిస్తుంటే వద్దని పివిపి బెదిరిస్తున్నారని ఆరోపించారు.. దీనిపై తాను ఆగ్రహం వ్యక్తం చేయగా.. పివిపి తనపై దౌర్జన్యానికి దిగారని కైలాష్ ఫిర్యాదులో పేర్కొన్నారు. 40 మంది వ్యక్తులను తమ ఇంటిపై దాడి చేయడానికి పంపించాడని ఆరోపించారు. గతంలోనూ ఇలాంటి బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపించారు కైలాష్.. దీంతో కైలాష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు బంజారాహిల్స్‌ పీఎస్‌లో పివిపిని ప్రశ్నించారు. ఈ నేపధ్యంలో పీవీపీ పై కేసు బుక్ చేసిన పోలీసులు ఆయనను ప్రశ్నించారు. విచారణకు హాజుకావాలని నోటీసులు ఇచ్చారు. విచారణ తర్వాత పీవీపీని పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉంది.



 


Tags:    

Similar News