YS Sharnila: తెలంగాణ సర్కార్ పై విమర్శలు సంధించారు వైఎస్ ష్మర్మిల. రాష్ట్రంలో వ్యాక్సిన్ల తయారీ సంస్థలు ఉన్నా ప్రభుత్వానికి టీకాలు దొరకడం లేదా అని ప్రశ్నించారు. ప్రభుత్వాస్పత్రుల్లో టీకా మొదటి డోస్ నిలివేసి నెలరోజు గడించింది. కానీ ప్రైవేట్ ఆస్పత్రుల్లో టీకాలు ఎలా దొరుకుతున్నాయని నిలదీశారు. ఈ మేరకు ఓ పత్రికలో వచ్చిన కథనాన్ని జోడిస్తూ ట్వీట్ చేశారు.
'తలాపున సముద్రమున్నా చాప దూపకేడ్చినట్టు. వ్యాక్సిన్ల తయారీ సంస్థలు గీడనే ఉన్నా మీకు మాత్రం దొరకటం లేదా? ప్రభుత్వాస్పత్రుల్లో ఫస్ట్ డోస్ బందుపెట్టి నెలరోజులైంది. ప్రైవేట్‌కు మాత్రం దొరుకుతున్నయ్. ఇప్పటికైనా మీ రీతి మార్చుకొని, ప్రజలకు ఉచితంగా వ్యాక్సిన్ అందించండి. ప్రభుత్వానికి దొరకని కరోనా వ్యాక్సిన్లు ప్రైవేట్‌కు ఎలా దొరుకుతున్నయి కేసీఆర్ సారూ...? మీకు చేతకాకనా? ప్రజల ప్రాణాలంటే పట్టింపు లేకనా? కమీషన్లకు ఆశపడా? లేక వ్యాక్సిన్ల భారం తగ్గించుకునేందుకా? ఇంకెన్నాళ్లు దొరా మూతకండ్ల పరిపాలన..?' అని కేసీఆర్‌పై షర్మిల ఘాటు ట్వీట్ చేశారు.