వైఎస్ షర్మిల పార్టీ ఏర్పాటుకు రంగం సిద్ధం అవుతోంది. జులై 8న వైఎస్ఆర్ జయంతి సందర్భంగా పార్టీ ఏర్పాటుకు మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. జులై 8 అయితే ఆలస్యం అవుతుందని మే 14 అయితే వెంటనే పాదయాత్ర ప్రారంభించవచ్చని నేతలు సూచించినట్లు సమాచారం. షర్మిల పార్టీ ఏర్పాటుకు మే 14, జులై 8 తేదీలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. షర్మిలతో ఏపీ ప్రభుత్వ మాజీ సలహాదారు రామచంద్రమూర్తి భేటీ అయ్యారు. లోటస్‌పాండ్‌లో షర్మిలను నల్గొండ జిల్లా కాంగ్రెస్ నేత తూడి దేవేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ మాగం రంగారెడ్డి కలిశారు.