భర్తతో సన్నిహితంగా ఉందని.. యువతిపై ఐదుగురు యువకులతో లైంగిక దాడి చేయించిన కిలాడీ

Sexually Assaulting: అక్రమసంబంధాలు నేరపూరిత కుట్రలు నిత్యం వెలుగు చూస్తూనే ఉన్నాయ్.

Update: 2022-05-30 11:30 GMT

భర్తతో సన్నిహితంగా ఉందని.. యువతిపై ఐదుగురు యువకులతో లైంగిక దాడి చేయించిన కిలాడీ

Sexually Assaulting: అక్రమసంబంధాలు నేరపూరిత కుట్రలు నిత్యం వెలుగు చూస్తూనే ఉన్నాయ్. తాజాగా హైదరాబాద్ కొండాపూర్ లో ఇలాంటి ఘటన ఒకటి జరిగింది. తన భర్తతో సన్నిహితంగా ఉన్న మహిళకు ఓ గ్యాంగ్ తో కలిసి లైంగిక దాడి చేయించిందో కిలాడీ. తన భర్తతో సన్నిహితంగా ఉందన్న కారణంతో కొందరు అనుచరులతో యువతిపై లైంగిక దాడికి తెగబడింది. కుటుంబ సభ్యులను ఉన్న సమయంలోనే యువతిని బంధించి దాడి చేయించింది. గాయపడిన యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కుటుంబ సభ్యులు ఆమెను ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఈ కేసులో పోలీసులు గాయత్రి సహా 6గురిని అరెస్ట్ చేసి పోలీసులు రిమాండ్‌కు తరలించారు. మొత్తం కేసును గోప్యంగా ఉంచడంపై పోలీసులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయ్.

గచ్చిబౌలి పోలీస్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. తన భర్తకు సన్నిహితంగా ఉంటుందని ఓ భార్య ఘాతుకానికి పాల్పడింది. యువతిపై లైంగిక దాడి చేయించడం కలకలం రేపింది. గాయత్రి భర్త శ్రీకాంత్ సివిల్స్‌కు ప్రిపేర్ అవుతున్నాడు. లా-ఎక్సలెన్స్ ఇన్టిట్యూట్‌లో అన్లైన్ క్లాసులకు ఎటెండ్ అవుతున్నాడు. బాధితురాలు కూడా అదే ఇన్‌స్టిట్యూట్‌లో శిక్షణ తీసుకుంటోంది. ఇందులో భాగంగా బాధితురాలికి శ్రీకాంత్ పరిచయం అయ్యాడు. గాయత్రికి కూడా పరిచయం చేశాడు. గతేడాది అక్టోబర్‌లో గాయత్రికి అనారోగ్యంగా ఉండటంతో బాధితరాలిని ఇంటికి పిలిచింది. వారిద్దరికి పరిచయం పెరగడంతో తన ఇంట్లోనే ఉండమని గాయత్రిని కోరడంతో ఫిబ్రవరి వరకూ గాయత్రి ఇంట్లోనే ఉండి బాధితురాలు సివిల్స్‌కు ప్రిపేర్ అయింది. ఇదే క్రమంలో తన భర్తతో బాధితురాలు వివాహేతర సంబంధం పెట్టుకుందని ఏప్రిల్ 22న బాధితురాలిపై గాయత్రి గచ్చబౌలి పీఎస్‌లో ఫిర్యాదు చేసింది.

అనూహ్యంగా ఈ నెల 26న బాధితురాలితో పాటు కుటుంబ సభ్యులను గాయత్రి తన ఇంటికి పిలిచింది. కేసు విత్ డ్రా చేసుకుంటానని చెప్పడంతో వారు నమ్మి అక్కడికి వచ్చారు. చెప్పినట్లుగా కేసును విత్ డ్రా చేసుకున్న గాయత్రి బాధితురాలి కుటుంబ సభ్యులను ఇంటి బయట ఉండాలని చెప్పి గాయత్రిని ఇంటి లోపలకు తీసుకెళ్ళింది. ఆమెపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న గాయత్రి పథకం ప్రకారం ఆమెపై దాడికి యత్నించింది. తనకు పరిచయం ఉన్న ఐదుగురు వ్యక్తులను ముందుగానే ఇంట్లో ఉంచింది. యువతి లోపలకి రాగానే పృధ్వీ, విష్ణు వర్థన్, మనోజ్, మస్తాన్, ముజాహిద్, మౌలాలీలు కాళ్లూ, చేతులు గట్టిగా పట్టుకున్నారు. ఆమె నోటిలో గుడ్డలు కుక్కి లైంగిక దాడికి యత్నించారు.

గాయత్రి కూడా ఆమెపై దాడి చేసింది. లైంగిక దాడి చేసే సమయంలో మొబైల్‌లో రికార్డ్ చేసింది. బాధితురాలు కేకలు పెట్టడంతో 5గురు వ్యక్తులు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. విషయం ఎవరికైనా చెబితే వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ పెడతానంటూ బెదిరించింది. బాధితురాలిని బయటకు పంపిచేసింది. రక్తస్రావం అవుతున్న బాధితురాలిని కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చేర్పించారు. మొత్తం ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు గాయత్రితో పాటు నిందితులందరినీ అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. అయితే ఈ విషయాన్ని పోలీసులు గోప్యంగా ఉంచారు. గాయత్రికి పోలీసులు సహాయం చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఇక గాయత్రి గతంలో ప్రేమ వివాహం చేసుకుంది. భర్తతో విభేదాలతో 2014 నుంచి శ్రీకాంత్ అనే వ్యక్తిని రిజిస్టర్ మేరేజ్ చేసుకొంది. అనారోగ్యం కారణంగా 2015లో గాయత్రి తండ్రి రత్నాకర్ రాజు చనిపోవడంతో ఆ ఆస్తి మీద శ్రీకాంత్ కన్నుపడిందని గాయత్రి కుటుంబ సభ్యులు చెబుతున్నారు. శ్రీకాంత్ సహకారంతో తన కుమారుడిని ఇంటి నుంచి వెళ్లగొట్టారని గాయత్రి తల్లి కృష్ణవేణి చెబుతోంది. ఇల్లు తనపేరు మీద ఉంటే శ్రీకాంత్‌తో కలిసి గాయత్రి తనపై దౌర్జన్యానికి దిగిందని వాపోయింది. జరిగిన ఘటనకు అసలు కారణం శ్రీకాంత్ అంటోంది. గాయత్రి అసలు ఎందుకు ఇలా చేసింది అర్థం కావడం లేదంటోంది తల్లి కృష్ణవేణి. ఇలాంటి చెడుపనులు చేస్తుందంటే సిగ్గుగా ఉందంది. 

Tags:    

Similar News