Hyderabad: మందుబాబులకు షాక్.. ఆ రెండు రోజులు వైన్‌షాపులు బంద్
Hyderabad: హోలీ పండుగ రాబోతోంది. హోలీ సందర్భంగా మందుబాబులకు షాకిచ్చారు హైదరాబాద్ పోలీసులు.
Hyderabad: హోలీ పండుగ రాబోతోంది. హోలీ సందర్భంగా మందుబాబులకు షాకిచ్చారు హైదరాబాద్ పోలీసులు. ఇక హోలీ సందర్భంగా రంగుల ఆటలే కాదు తాగి తందనాలాడే వాళ్ళు, తాగిన మత్తులో రోడ్ ప్రమాదాలకు గురయ్యే వాళ్ళు ప్రతి ఏటా పెరిగిపోతున్నారు. ఈ సమస్యలన్నిటికీ చెక్ పెట్టడానికి నడుంబిగించింది తెలంగాణ సర్కార్. అందుకే హోలీ సందర్భంగా లిక్కర్ కు నో చెప్పింది. హోలీ పండుగ నేపథ్యంలో 36 గంటలపాటు మద్యం దుకాణాలు బంద్ చేస్తున్నట్లు ప్రకటిస్తూ మందుబాబులకు షాక్ ఇచ్చారు.
హోలీ పండుగ సందర్బంగా మార్చి 28 తేది సాయంత్రం 6 గంటల నుంచి మార్చి 30 ఉదయం 6 గంటల వరకు హైదరాబాద్, సికింద్రాబాద్ పరిధిలోని మద్యం దుకాణాలు, కల్లు కాంపౌండ్‌లు, బార్ అండ్ రెస్టారెంట్‌లను మూసివేయాలని హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ తెలిపారు. ఈ మేరకు గురువారం ఆదేశాలు జారీ చేశారు. ఇతరులకు అసౌకర్యం కలిగించడం, రోడ్లపై రంగులు చల్లడం, గుంపులుగా వాహనాలపై తిరగడం వంటి తదితర చర్యలను నిషేధిస్తూ మరో ప్రత్యేక ఉత్తర్వులు వెలువరించారు. ఈ నియమాలను ఉల్లంఘించినైట్లెతే అటువంటి వ్యక్తులు విచారణను ఎదుర్కొవాల్సి ఉంటుందని పేర్కొన్నారు.