Huzurabad: హుజూరాబాద్‌ బైపోల్‌ వాయిదా పడుతుందా?

Huzurabad: హుజూరాబాద్‌ ఉపఎన్నిక వాయిదాకు టీఆర్ఎస్‌ కుట్ర చేస్తున్నారా?

Update: 2021-10-26 10:05 GMT

Huzurabad: హుజూరాబాద్‌ బైపోల్‌ వాయిదా పడుతుందా?

Huzurabad: హుజూరాబాద్‌ ఉపఎన్నిక వాయిదాకు టీఆర్ఎస్‌ కుట్ర చేస్తున్నారా? విజయమో వీర స్వర్గమో అన్నట్టుగా సాగుతున్న బైపోల్‌లో గెలవలేమనే గులాబీ దళం గుట్టుగా రాజకీయం చేస్తోందా? ప్రతిష్టాత్మక హోరాహోరి పోరులో గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డుతున్న కమలనాథులు ఎందుకా మాట అన్నారు? నిజంగానే హుజూరాబాద్‌ ఉపఎన్నిక వాయిదా కుట్ర జరుగుతోందా? మరి ఇందులో సూత్రధారులు ఎవరు? పాత్రధారులు ఎవరు? కమలనాథుల ఎందుకు కలవరపడుతున్నారు?

హుజూరాబాద్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ దూకుడు పెంచినా ఓ విషయం మాత్రం రాజకీయ వర్గాలు, జనాల్లో చర్చగా మారింది. అదే టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌ హుజూరాబాద్‌ బైపోల్‌ వాయిదా వేయించే పనిలో పడ్డారని!! హుజూరాబాద్‌ ఉపఎన్నికలో వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా ప్రజల మనసు మార్చలేమని గ్రహించిన సీఎం కేసీఆర్‌ ప్రజాప్రతినిధులను కొనుగోలు చేసినా ఫలితం లేదని అర్థమయ్యే బైపోల్‌ పోస్ట్‌పోన్డ్‌కు యాక్షన్‌ ప్లే చేస్తున్నారని సాక్షాత్తూ కమలరథసారథి బండి సంజయ్‌ అంటున్నారు. ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి శాంతిభద్రతల సమస్యను సృష్టించి ఎన్నికలను వాయిదా వేయించేందుకు కేసీఆర్‌ కుట్ర చేస్తున్నారంటూ బండి ఆరోపించడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది.

హుజూరాబాద్‌లో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ప్రచారం చేస్తుండగా టీఆర్‌ఎస్‌ నేతలు దాడి చేసి అడ్డుకునే ప్రయత్నం చేయడాన్ని కమలం పార్టీ రాజకీయ అస్త్రంగా మలుచుకుందన్న చర్చ జరుగుతోంది. సీఎం కేసీఆర్‌ డైరెక్షన్‌లో ఈ దాడి జరిగిందంటూ విమర్శించిన బండి హుజూరాబాద్‌ ప్రజలు పోలింగ్‌కు రాకుండా భయభ్రాంతులకు గురిచేసేలా గులాబీ గ్యాంగ్‌ కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి స్టాటెజీనే మొన్నటి గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల టైమ్‌లోనూ జరిగిందని ఉదాహరణలు చెబుతున్నారు సంజయ్‌. నాటి ఎన్నికల సమయంలో బీజేపీ దాడులు చేస్తోందని, మత కల్లోలాలు సృష్టించే కుట్ర చేస్తోందంటూ టీఆర్ఎస్‌ నేతలు తప్పుడు ప్రచారం చేసి ఫెయిల్‌ అయ్యారని, హుజూరాబాద్‌‌లోనూ మళ్లీ ఇదే కుట్రను అమలు చేయబోతున్నారని బండి ధ్వజమెత్తడం సంచలనం సృష్టిస్తోంది. ఓటుకు 20 వేలు పంచాలనుకొని విఫలమవుతుండటంతో భౌతిక దాడులకు పురిగొల్పుతున్నారని సంజయ్‌ ఆరోపించారు.

రెండు దశాబ్దాలుగా హుజురాబాద్ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ఈటలకు అక్కడ గట్టి పట్టుంది. మంత్రివర్గం నుంచి తొలగించారనే సానుభూతి కూడా కనిపిస్తోందట. తనకు జరిగిన అన్యాయంపై పాదయాత్రతో ఈటల ప్రజల్లోకి వెళ్లడంతో సర్కార్‌పై కొంత వ్యతిరేకత వస్తోందన్నది గులాబీ వర్గీయుల అంచనాగా చెబుతున్నారు కమలనాథులు. కారు పార్టీకి పొలిటికల్ గ్రౌండ్ సేఫ్ కాదని తెలియడంతో

హుజురాబాద్‌ పరిసర ప్రాంతాల్లో సభ నిర్వహించలేదని వారంటున్నారు. అయితే, కమలం పార్టీ ఆరోపణలను టీఆర్‌ఎస్‌ పార్టీ నిలువునా ఖండిస్తోంది. ఈటల గెలుపు అసాధ్యమన్న సమాచారంతోనే బండి సంజయ్‌ నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారంటూ రివర్స్‌ ఎటాక్‌ చేసింది. మరి, ప్రచారం గడువు సమీపిస్తుండటం, పోలింగ్‌కు ముహుర్తం ముంచుకొస్తుండటంతో రాబోయే రోజుల్లో హుజూరాబాద్‌ సెంటర్‌గా ఎంటర్‌ పొలిటిక్స్‌ ఇంకెలాలంటి స్కెచ్‌ వేస్తుందో చూడాలి.

Tags:    

Similar News