EG.5: మన దేశానికి కరోనా కొత్తరూపం వచ్చేనా..?

EG.5: జాగ్రత్తగా ఉండడం మంచిదంటున్న 'గాంధీ' సూపరింటెండెంట్ రాజారావు

Update: 2023-08-13 05:19 GMT

EG.5: మన దేశానికి కరోనా కొత్తరూపం వచ్చేనా..?

EG.5: ప్రపంచాన్ని కరోనా వైరస్ అతలాకుతలం చేసింది.. ఈ మహమ్మారి లక్షలాది మందిని పొట్టన పెట్టుకుంది.. ఇప్పటికీ ప్రపంచంలో ఎదో ఒక మూల కొత్త రూపం సంతరించుకుని మానవాళిని భయపెడుతూనే ఉంది.. అయితే ప్రస్తుతం వివిధ దేశాలు, రాష్ట్రాల్లో కరోనా కేసులు స్వల్పంగా పెరుగుతున్నాయి.. మనదేశంలో కరోనా విజృంభించే అవకాశం ఉందా..? ఒకవేళ వైరస్ వ్యాప్తి చెందితే ఎలాంటి లక్షణాలు ఉంటాయి..

కరోనా... ఈ పేరును ఇప్పుడిప్పుడే మర్చిపోతున్నారు జనం.. రెండు సంవత్సరాలు ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా క్రమంగా తగ్గుముఖం పట్టింది. దీంతో అన్ని రకాలుగా వ్యవస్థలు ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్న క్రమంలో యూకే, అమెరికా దేశాలు, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో కొత్త వేరియంట్ కలకలం సృష్టిస్తోంది.. ఒమిక్రాన్ జాతికి చెందిన ఎరిస్ వేరియంట్ టెన్షన్ జనాన్ని పెడుతోంది. వివిధ దేశాలు, రాష్ట్రాల్లో వేల సంఖ్యలో కేసులు నమోదైనప్పటికీ... మనదేశంలో మాత్రం తీవ్రత పెద్దగా కనిపించడం లేదంటూనే... జాగ్రత్తగా ఉండడం మంచిదంటున్నారు గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ రాజారావు.

Tags:    

Similar News